ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మానవ హక్కులకు భరోసా - అందరికీ ప్రభుత్వ సేవలు, గౌరవం’పై జాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా


· మానవ హక్కుల దినోత్సవం ఓ చారిత్రక ప్రకటనను స్మరించుకునే రోజు మాత్రమే కాదు.. మానవ జీవనంలో గౌరవాన్ని పొందేందుకు నాంది

· సాంకేతికత, పర్యావరణం, డిజిటల్ సమ్మిళితత్వాల దిశగా మానవ హక్కుల పరిణామం

· ఇంట్లో గౌరవం, సామాజిక రక్షణ, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బలహీన సమాజాలకు న్యాయం... ఈ నాలుగు అంశాలు ప్రాతిపదికలుగా భారత్‌లో మానవ హక్కులకు భరోసా

· బాధ్యాతాయుతంగా సాంకేతికత వినియోగం, సంస్థాగత దార్శనికతను బలోపేతం చేయడం, ప్రతి ప్రభుత్వ సేవలోనూ గౌరవమే నిర్దేశక సూత్రంగా భరోసానిచ్చేలా... ప్రజా కేంద్రీకృత పాలనను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న డాక్టర్ పి.కె. మిశ్రా

నాడు పోస్టు చేయడమైనది: 10 DEC 2025 3:32PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘నిత్యావసరాలపై భరోసా.. అందరికీ ప్రజాసేవలుగౌరవం’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కెమిశ్రా ప్రసంగించారుభారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో మానవ హక్కుల దినోత్సవం ప్రాధాన్యాన్ని తన కీలకోపన్యాసంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుఇక్కడ రాజ్యాంగ ఆదర్శాలుప్రజాస్వామిక సంస్థలుసామాజిక విలువలు కలిసి మానవ గౌరవాన్ని రక్షించిప్రోత్సహిస్తాయని వివరించారుఆహారందుస్తులుఆవాసంవైద్య సంరక్షణసామాజిక సేవలుదుర్బల సమయాల్లో భద్రత సహా తగిన జీవన ప్రమాణాల హక్కుకు భరోసా ఇస్తున్న.. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (1948)లోని అధికరణ 25(1)ను ఆయన గుర్తుచేశారుమానవ హక్కుల దినోత్సవం కేవలం ఓ సంస్మరణ దినం మాత్రమే కాదనిదైనందిన జీవితంలో మానవ గౌరవానికి అది నాంది అని ఆయన వ్యాఖ్యానించారుఈ ఏడాది ఇతివృత్తం మానవ హక్కులుమన దైనందిన ఆవశ్యకత.. ప్రభుత్వంతో ప్రజలను మరింత మమేకం చేయడంలో ప్రభుత్వ సేవలుప్రజాస్వామిక సంస్థల పాత్రను వివరించేదిగా ఉంది.

సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపకల్పనలో భారత్ పోషించిన చారిత్రక పాత్రనుముఖ్యంగా డాక్టర్ హన్సా మెహతా సేవలను డాక్టర్ మిశ్రా గుర్తు చేశారు. ‘‘మానవులంతా స్వేచ్ఛగాసమానులుగా జన్మించారు’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసేలా ఆయన కృషిచేశారులింగ సమానత్వం కోసం ఇదొక నిశ్చయాత్మక ముందడుగుఆహారంనీరుఆశ్రయంవిద్యన్యాయాన్ని పొందడం ద్వారా హక్కులను సాధించుకోవాలని ఆయన స్పష్టం చేశారుమానవ హక్కుల చింతన పౌరరాజకీయ హక్కుల నుంచి సామాజికఆర్థికసాంస్కృతిక హక్కుల వరకు అన్నింటినీ సమ్మిళితం చేసుకుని పరిణామం చెందిందనీ.. అదిప్పుడు సాంకేతికతడిజిటల్ వ్యవస్థలుపర్యావరణ విషయాలు వంటి కొత్త అంశాలకూ విస్తరించిందనీ ఆయన అన్నారుకేవలం స్వేచ్ఛలు మాత్రమే కాకుండా.. గోప్యతప్రయాణంపరిశుభ్రమైన వాతావరణండిజిటల్ సమ్మిళితత్వాలు నేడు గౌరవాన్ని రూపుదిద్దుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

భారతీయ నాగరికత.. గౌరవ భావంకర్తవ్య నిష్టలను ప్రజా జీవితానికి కేంద్రంగా నిలిపిందన్నారుధర్మంన్యాయకరుణసేవ వంటి భావనలు ధర్మబద్ధమైన ప్రవర్తననుసంక్షేమాన్ని ప్రవచిస్తూనే.. అహింసనుసంక్షేమాన్ని ప్రోత్సహించాయివసుధైక కుటుంబం వంటి భావన విస్తృత మానవ సమాజం మధ్య ఆత్మీయతను ప్రోత్సహించిందిసార్వత్రిక వయోజన ఓటు హక్కుఅలాగే ప్రాథమిక హక్కులతోపాటు విద్యఆరోగ్యంజీవనోపాధిసంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే ఆదేశిక సూత్రాల వరకు... రాజ్యాంగ రూపకల్పనను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయన్నారు.

2014కు ముందటి దశాబ్దాన్ని ప్రస్తావిస్తూ.. విద్యా హక్కు చట్టంఎంజీఎన్ఆర్ఈజీఏజాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలతో అభివృద్ధి కోసం హక్కుల ఆధారిత విధానాన్ని భారత్ అనుసరించిందని డాక్టర్ మిశ్రా అన్నారుఅయితే హక్కులను అందించి వాటిని సమర్థంగా అమలు చేయకపోవడం విశ్వసనీయతను దెబ్బతీసింది2014 నుంచి ప్రభుత్వం సంపూర్ణతా విధానాన్ని అనుసరిస్తోందిఅర్హులైన లబ్ధిదారులెవరూ ప్రయోజనాలను కోల్పోకుండా చూస్తోంది. ‘పత్రాలకే పరిమితమైన హక్కుల’ నుంచి ‘అమలైన హక్కుల’ దిశగా మార్పును ఇది సూచిస్తోందిడిజిటల్ మౌలిక సదుపాయాలుప్రత్యక్ష ప్రయోజన బదిలీలువికసిత భారత్ సంకల్ప యాత్ర వంటి ప్రజావగాహన కార్యక్రమాల ద్వారా ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందిగత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ధ్రువీకరించిందని ఆయన తెలిపారుమానవ హక్కుల క్రియాశీలతలో పేదరిక నిర్మూలన అన్నది అత్యంత ప్రభావవంతమైన అంశమన్నారు.

దైనందిన హక్కులకు రక్షణనిచ్చే నాలుగు ప్రాతిపదికలను డాక్టర్ మిశ్రా వివరించారుమొదటిది ఇంట్లో గౌరవంప్రధానమంత్రి ఆవాస్ యోజనజల్ జీవన్ మిషన్స్వచ్ఛ భారత్ అభియాన్సౌభాగ్యఉజ్వల యోజన పథకాల కింద గృహ నిర్మాణంనీరుపారిశుద్ధ్యంశుద్ధ ఇంధనం వంటి అంశాలు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయిరెండోది సామాజిక రక్షణకోవిడ్ కాలంలో 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ఆహారాన్ని అందించడంతోపాటు 42 కోట్ల మంది పౌరులకు ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై ద్వారా ఆహార భద్రతనుఆరోగ్యాన్ని ప్రభుత్వం అందించిందిబీమాపింఛన్లుకొత్త కార్మిక చట్టాల ద్వారా అనధికారికగిగ్ కార్మికులకు కూడా ప్రయోజనాల విస్తరణ సాధ్యమైందిఅలాగే మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం వంటి సంస్కరణలు బలహీన వర్గాలకు గౌరవాన్ని అందించాయిమూడో అంశం సమ్మిళిత ఆర్థిక వృద్ధిఆర్థిక సమ్మిళితత్వంసాధికారత ద్వారా ఇది పురోగమించిందిప్రత్యక్ష ప్రయోజన బదిలీల్లో జేఏఎం త్రయం విప్లవాత్మక మార్పులను తెచ్చింది56 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాల ద్వారా.. బ్యాంకు ఖాతా లేని వారు అధికారిక బ్యాకింగ్ పరిధిలోకి వచ్చారుప్రధానమంత్రి ముద్ర యోజనప్రధానమంత్రి స్వనిధి వంటి పథకాలు పారిశ్రామిక అవకాశాల కల్పనకు దోహదపడ్డాయిస్వయం సహాయక సంఘాలు, ‘లాఖ్‌పతి దీదీలు’బేటీ బచావో బేటీ పడావోచట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ల వంటి చరిత్రాత్మక నిర్ణయం ద్వారా మహిళా సాధికారత పురోగమించిందినాలుగో అంశం బలహీన వర్గాలకు న్యాయంరక్షణకొత్త న్యాయ చట్టాలుఫాస్ట్ ట్రాక్ కోర్టులుపోక్సో చట్టందివ్యాంగుల హక్కుల చట్టంగిరిజన వర్గాల కోసం ప్రధానమంత్రి జన్‌మాన్ ద్వారా ఇది బలోపేతమైందివ్యాక్సిన్ మైత్రి వంటి మానవీయ సాయం.. సార్వత్రిక మానవ హక్కుల పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ప్రధానమంత్రి జన్ భాగీదారీ పిలుపుతో ప్రభుత్వ సేవల పంపిణీలో గణనీయమైన మార్పులొచ్చాయిసూచనల నుంచి స్పందనల దిశగాపథకాలను అందించే స్థితి నుంచి గౌరవాన్ని అందించే దిశగాప్రజలను లబ్ధిదారులుగా చూడడం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మార్చే దిశగా ఈ మార్పులను స్పష్టంగా గమనించవచ్చుఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నికవడం.. ప్రజాస్వామిక సంస్థలుసమ్మిళిత అభివృద్ధిపై అంతర్జాతీయ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

వికసిత భారత్ 2047 దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో.. సరికొత్త సవాళ్లకు అనుగుణంగా వ్యవస్థాగత ఏర్పాట్లు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను శ్రీ మిశ్రా కోరారువాతావరణ మార్పుపర్యావరణ న్యాయండేటా రక్షణఅల్గారిథంపరంగా చట్టబద్ధతబాధ్యతాయుత ఏఐగిగ్ కార్మికుల కష్టాలుడిజిటల్ నిఘా వంటివి ముఖ్యమైన సమస్యలుగా వివరించారు.

సుపరిపాలన ఒక ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన డాక్టర్ మిశ్రా.. సమర్థతపారదర్శకతఫిర్యాదుల పరిష్కారంసకాలంలో సేవలందించడం దాన్ని నిర్దేశిస్తాయని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారుప్రజా కేంద్రీకృత పాలనబాధ్యతాయుతంగా సాంకేతికత వినియోగంప్రజలకు గౌరవాన్ని అందించే దిశగా సమష్టి కార్యాచరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... జీవనానుకూల నగరాలుశక్తిమంతమైన గ్రామాలతో కూడిన ఆధునికసమ్మిళిత భారత్ మనకు కావాలన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254331) సందర్శకుల సూచీ సంఖ్య : : 8