హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డోల్ జాత్రా, డోలా పూర్ణిమల సందర్బంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఈ భక్తి, రంగుల పండుగ.. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక

భగవాన్ కృష్ణునితో ఉల్లాసంగా మమేకం చేసే ఈ పర్వదినం అందరికీ సంతోషం, సౌభాగ్యాల ఆశీస్సుల్ని అందించుగాక

మన మూలాలూ, సంస్కృతీ సంప్రదాయాలతో మన బంధాన్ని ఈ పండుగ రోజు వైభవం మరింత బలోపేతం చేయుగాక

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 12:33PM by PIB Hyderabad

ఈ రోజు శుభప్రదమైన డోల్ జాత్రా, డోలా పూర్ణిమ.. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల ప్రజలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా అనేక సందేశాలను పొందుపరుస్తూ :
‘‘డోల్ జాత్రా సందర్బంగా పశ్చిమ బెంగాల్‌లోని నా అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ ఇవే శుభాకాంక్షలు. ఈ పండుగ శోభ మన మూలాలు, సంస్కృతి సంప్రదాయాలతో మన బంధాన్ని మరింత బలపరచడంతో పాటు, అందరి జీవితంలోనూ సంతోషాన్ని, సమృద్ధిని కలుగ జేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
‘‘డోలా పూర్ణిమ సందర్భంగా ఒడిశా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవాన్ కృష్ణునితో మనను ఉల్లాసంగా మమేకం చేసే ఈ పండుగ అందరికీ సంతోష, సౌభాగ్యాల ఆశీస్సుల్ని ప్రసాదించుగాక’’ అని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.
‘‘డోల్ జాత్రా శుభ సందర్భంగా అస్సాంలోని మన అక్కలూ, చెల్లెళ్లకూ, అన్నలూ, తమ్ముళ్లకూ శుభాకాంక్షలు. భక్తిని, రంగుల్నీ కలబోసే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమృద్ధి ని అందించుగాక’’ అని ఆయన అన్నారు.


***


(రిలీజ్ ఐడి: 2235039) సందర్శకుల సూచీ సంఖ్య : : 62