ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.10,000 కోట్ల ప్రత్యేక ఎస్ఎమ్ఈ గ్రోత్ ఫండ్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


ఎంపిక ప్రమాణాల ఆధారంగా వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడం లక్ష్యం

ఎమ్ఎస్ఎమ్ఈలకు లిక్విడిటీ మద్దతు కోసం టీఆర్ఇడీఎస్ పూర్తి సామర్థ్యాల

ఉపయోగానికి 4 చర్యలను ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్

प्रविष्टि तिथि: 01 FEB 2026 1:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయాత్మకంగాసుస్థిరంగా... సందిగ్ధతకు బదులుగా చేతలకుిమర్శకు బదులుగా సంస్కరణలనుప్రజాకర్షకకు బదులుగా ప్రజా సంక్షేమాన్ని ఎంచుకుని ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఈ రోజు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ... తమ ప్రభుత్వం కర్తవ్యాల స్ఫూర్తిగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారుఉత్పాదకతపోటీతత్వాన్ని పెంచుతూ... వ్యాపార సంస్థలుఆర్థిక వ్యవస్థలు ప్రపంచ అస్థిరతలను ఎదుర్కొంటూ సమర్థంగా అభివృద్ధి చెందేలా చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంస్థిరంగా కొనసాగించడం ప్రభుత్వ మొదటి కర్తవ్యమని ఆమె అన్నారు.

ఎమ్ఎస్ఎమ్ఈలను వృద్ధికి కీలక చోదక శక్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి... మొదటి కర్తవ్యం కింద ఎమ్ఎస్ఎమ్ఈలను ఛాంపియన్లుగా అభివృద్ధి చేయడంలో సహాయపడే మూడంచెల విధానాన్ని ప్రతిపాదించారు.

మొదటి విధానం ఈక్విటీ మద్దతుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి... దీనిలో భాగంగా భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడం కోసం ఎంపిక ప్రమాణాల ఆధారంగా వ్యాపార సంస్థలను ప్రోత్సహించడానికి రూ.10,000 కోట్ల ప్రత్యేక ఎస్ఎమ్ఈ గ్రోత్ ఫండ్‌ను ప్రవేశపెట్టారుసూక్ష్మ వ్యాపార సంస్థలకు మద్దతును కొనసాగించడం కోసం వారికి రిస్క్ మూలధనాన్ని అందుబాటులో ఉంచుటను కొనసాగించడానికి రూ.2,000 కోట్లతో 2021లో ఏర్పాటు చేసిన స్వయం-సమృద్ధ భారత్ నిధి టాప్ అప్‌ను ఆమె ప్రతిపాదించారు.

రెండో విధానమైన లిక్విడిటీ మద్దతు గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ... టీఆర్ఇడీఎస్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. 7 లక్షల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారుదాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికిఆమె చర్యలను ప్రతిపాదించారు: (i) ఎమ్ఎస్ఎమ్ఈల నుంచి సీపీఎస్ఈలు చేసే అన్ని కొనుగోళ్లకు ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా టీఆర్ఇడీఎస్‌ను తప్పనిసరి చేయడంఇది ఇతర కార్పొరేట్‌లకు బెంచ్‌మార్క్‌గా పనిచేస్తుంది. (ii) టీఆర్ఇడీఎస్‌ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ కోసం సీజీటీఎమ్ఎస్ఈ ద్వారా క్రెడిట్ గ్యారెంటీ సపోర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం. (iii) ఎమ్ఎస్ఎమ్ఈల నుంచి ప్రభుత్వం చేసే కొనుగోళ్ల గురించి ఫైనాన్షియర్‌లతో సమాచారాన్ని పంచుకోవడం కోసం చవకైనవేగవంతమైన ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహించడానికి జీఇఎమ్‌ను టీఆర్ఇడీఎస్‌తో అనుసంధానించడం. (iv) టీఆర్ఇడీఎస్‌ రిసీవబుల్స్‌ను ఆస్తి-ఆధారిత సెక్యూరిటీలుగా ప్రవేశపెట్టడం... సెకండరీ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడటం... లిక్విడిటీని పెంచడంలావాదేవీల సెటిల్మెంట్‌ను మెరుగుపరచడం.

చివరి విధానమైన వృత్తిపరమైన మద్దతు గురించి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఐసీఏఐఐసీఎస్ఐఐసీఎమ్ఏఐ వంటి వృత్తిపరమైన సంస్థలకు స్వల్పకాలికమాడ్యులర్ కోర్సులు... ప్రాక్టికల్ టూల్స్‌ను రూపొందించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారుముఖ్యంగా టయర్-IIటయర్-III పట్టణాల్లో 'కార్పొరేట్ మిత్రకేడర్‌ను అభివృద్ధి చేయడానికీ వీలుంటుందని తెలిపారుఎమ్ఎస్ఎస్ఈలు తక్కువ ఖర్చుతో అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో ఈ గుర్తింపు పొందిన పారా-ప్రొఫెషనల్స్ సహాయపడతారు.

 

****


(रिलीज़ आईडी: 2221503) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada