ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సానుకూల ఫలితాలను సాధిస్తూ వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి ఆవిష్కరణలు: ఆర్థిక సర్వే


భూమి, వనరుల నిర్వహణ, మార్కెట్ సంస్కరణలు, నీటి నిర్వహణ,

సాంకేతిక, డిజిటల్ వ్యవసాయం తదితర రంగాల్లో ఆవిష్కరణలు

प्रविष्टि तिथि: 29 JAN 2026 2:00PM by PIB Hyderabad

భూముల నిర్వహణమార్కెట్లునీటి నిర్వహణసాంకేతికత స్వీకరణపంట వైవిధ్యీకరణ తదితర లక్ష్య ఆధారిత సంస్కరణలను ఇటీవలి సంవత్సరాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు చేపట్టాయిఈ కార్యక్రమాలన్నీ రాష్ట్రాల వ్యవసాయ ఫలితాలను మెరుగుపరిచాయని కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది.

వివిధ రాష్ట్రాలు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలుపరిపాలనపథకం ఆధారిత కార్యక్రమాలు సాధించిన ఫలితాలు:

భూమివనరుల నిర్వహణ: డ్రోన్లనుకంటిన్యూయస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీవోఆర్ఎస్)నుజీఐఎస్ సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైన డిజిటల్ భూహక్కులను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు (2021)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందిదీని ద్వారా 2025 నాటికి 6,901 గ్రామాల్లో 81 లక్షల భూ కమతాలను రీసర్వే చేయగాసుమారుగా 86,000 సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి.

ఆక్వాసాగు కోసం చౌర్ భూములను అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి సమేకిత్ చౌర్ వికాస్ యోజన (2025)ను బీహార్ ప్రారంభించిందిదీని ద్వారా 22 జిల్లాల్లో మత్స్య సాగు పరిధిలోకి 1,933 హెక్టార్ల భూమిని తీసుకువచ్చింది.

మార్కెట్ సంస్కరణలుమధ్యప్రదేశ్ ప్రారంభించిన సౌదా పత్రక్ కార్యక్రమం (2021) డిజిటల్ వేదికల ద్వారా రైతుల నుంచి ఎంఎస్‌పీ ఆధారిత కొనుగోళ్లకు వీలు కల్పించిందిఇది మార్కెట్లలో రద్దీని తగ్గించి చెల్లింపుల్లో పారదర్శకతను పెంపొందిస్తుందిడిసెంబర్ 2025 నాటికి 1.03 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులనువ్యాపారులకు వారధిగా ఈ-ఫార్మ్‌మార్కెట్ వేదిక పనిచేస్తోంది.

జల నిర్వహణకొత్త పథకాలుసోలార్ పంపుల ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన అస్సాం రాష్ట్ర నీటి పారుదల ప్రణాళిక (2022) ద్వారా 2024-25 నాటికి సాగు విస్తీర్ణం 24.28 శాతం మేర పెరిగింది.

ఉత్తరప్రదేశ్ అమలు చేస్తున్న భూగర్భ జల నియమాలు (2020) ద్వారా భూగర్భ నీటి వినియోగం నిబంధనలను బలోపేతం చేశారుదీని వల్ల 2025 నాటికి భూగర్భ జలాల్లో స్వల్ప పెరుగుదల కనిపించిందిఅలాగే భూగర్భ జల వినియోగం కూడా పెరిగింది.

సాంకేతికతడిజిటల్ వ్యవసాయం: కర్ణాటక అమలు చేస్తున్న ఎఫ్‌ఆర్యూఐటీఎస్ వేదిక (2020) తన పరిధిలోకి 55 లక్షల మంది రైతులువివిధ పథకాలను తీసుకువస్తూ.. డీబీటీఎంఎస్‌పీ సేకరణపంట సర్వేలకు తోడ్పాటు ఇచ్చేలా ఏకీకృత రైతు డేటాబేస్‌ను రూపొందించింది.

క్షేత్ర స్థాయిలో ట్రాకింగువాతావరణ సమాచార ఆధారిత ప్రణాళికకు వీలు కల్పించేలా జీఐఎస్ ఆధారిత క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్అగ్రి స్టాక్ స్కీమ్ (2024)ను జార్ఖండ్ ప్రారంభించిందిఫలితాల సూచికలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయిగతంలో అనుసరించిన ప్రణాళికల ఆధారంగా బీహార్‌ నాలుగో వ్యవసాయ ప్రణాళిక (2023-28)ను రూపొందిందిదీనివల్ల మత్స్యపాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి కనిపించింది.

పైన పేర్కొన్న ఉదాహరణలు వ్యవసాయ నిర్వహణలో సానుకూల ఫలితాలను సాధించేలా రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఆవిష్కరణలు భారతీయ వ్యవసాయ వృద్ధిని ఎలా నడిపించాయో వివరిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2220315) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam