హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇథియోపియాలో అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్న సందర్భంగా


ఆయనకు అభినందనలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

ఇది భారతీయులందరికీ గర్వకారణం

మోదీ జీ రాజనీతిజ్ఞ‌తకు విదేశాలు అందించిన 28వ పురస్కారమిది..
ఆయన నాయకత్వంలో ప్రపంచ దౌత్యవిధాన రంగంలో భారత్ హోదా అంతకంతకూ పెరుగుతుండటాన్ని
ఈ అవార్డు సూచిస్తోంది

ఈ గౌరవం భారత్, ఇథియోపియాల మైత్రిలో ఓ ముఖ్య ఘట్టం

प्रविष्टि तिथि: 17 DEC 2025 11:01AM by PIB Hyderabad

ఇథియోపియాలో అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బహూకరించడం భారతీయులంతా గర్వపడే క్షణమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు..:
‘‘భారతీయులందరూ గర్వపడే క్షణమిది. ఇథియోపియాలో అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇచ్చి గౌరవించిన సందర్భంగా ఆయనకు ఇవే అభినందనలు.  మోదీ జీ రాజనీతిజ్ఞ‌తకు గాను విదేశాలు ప్రదానం చేసిన అవార్డులలో, ఇది 28వది. ఆయన నేతృత్వంలో ప్రపంచ దౌత్యవిధాన రంగంలో భారత్ హోదా అంతకంతకూ పెరుగుతూ ఉండటానికి ఇది ఒక ప్రతీక. ఈ గౌరవం భారత్, ఇథియోపియాల మైత్రిలో ఓ ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది.’’


(रिलीज़ आईडी: 2205081) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam