ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ గేయం ‘‘వందేమాతరం’’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఏడాది పాటు నిర్వహించే ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారత్, భరతమాత, భారతదేశమనే శాశ్వత భావనే వందేమాతర సారాంశం: పీఎం
వలస పాలన కాలంలో.. భారత్ స్వాతంత్ర్యం సాధిస్తుందని, బానిస సంకెళ్లను భరతమాత తెంచేస్తుందని, భారతీయులు తమ విధిని తామే లిఖించుకుంటారనే సంకల్పాన్ని వందేమాతరం ప్రకటించింది: పీఎం
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి వందేమాతరం ఊపిరిగా మారింది. ప్రతి ఉద్యమకారుడి గొంతులో ఈ నినాదం ప్రతిధ్వనించింది... ప్రతి భారతీయుని భావోద్వేగాన్ని వినిపించింది: పీఎం
స్వాతంత్ర్య సమరయోధులు పాడిన వందేమాతరం.. నిత్య స్ఫూర్తిగా నిలుస్తోంది....
మనకు స్వేచ్ఛ ఎలా వచ్చిందో గుర్తు చేస్తూనే.. దాన్ని ఎలా రక్షించుకోవాలో వివరిస్తుంది: పీఎం
జాతీయ పతాకం ఎగరేసిన ప్రతిసారి అసంకల్పితంగానే భారత్ మాతాకీ జై! వందే మాతరం!
పదాలను హృదయపూర్వకంగా నినదిస్తాం: పీఎం
Posted On:
07 NOV 2025 12:17PM by PIB Hyderabad
దేశం కోసం వందేమాతరం ఆలపిస్తూ.. ప్రాణత్యాగం చేసిన అందరికీ తెలిసిన, తెలియని, మరుగునపడిన, చరిత్ర పుటలకెక్కని వీరులందరికీ 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.
వేద శ్లోకాన్ని చెబుతూ.. ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని శ్రీ మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ వేద భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు.
దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.
వందేమాతరం ఆనాడు స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, నేడు మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం... భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు... సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం-ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని... జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఒక స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో దేశవ్యాప్తంగా మరో ఏడాది పాటు... 2026 నవంబరు 7 వరకూ నిర్వహించే వేడుకలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినివ్వడమేగాక జాతీయ ప్రతిష్ఠ, ఐక్యతలను ప్రోదిచేసే ఈ గేయం 150 ఏళ్ల సంబరాలను కొనసాగిస్తుంది.
ఈ వేడుకలలో ప్రధాన కార్యక్రమంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యంతో ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా ఆలపించారు.
ఈ ఏడాదితో వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ జాతీయ గీతాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఇది ఆయన నవల ‘ఆనందమఠ్’లో భాగంగా తొలిసారి సాహిత్య పత్రిక ‘బంగదర్శన్’లో ప్రచురితమైంది. శక్తిసామర్థ్యాలు, సౌభాగ్యం, దైవ స్వరూపంగా మాతృభూమిని ప్రార్థించే ఈ గీతం దేశ ఐక్యత, ఆత్మగౌరవాలను మేల్కొలిపే స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణను సమకూర్చింది. అటుపైన అనతి కాలంలోనే దేశభక్తికి శాశ్వత ప్రతీకగా మారింది.
****
(Release ID: 2187537)
Visitor Counter : 5
Read this release in:
Marathi
,
Tamil
,
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam