ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత సముద్ర వాణిజ్య పునరుజ్జీవ లక్ష్యాన్ని వివరించి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించిన ప్రధాని

Posted On: 30 OCT 2025 3:15PM by PIB Hyderabad

సముద్ర వాణిజ్య రంగంలో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతున్న భారత్‌పై తన ఆలోచనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పంచుకున్నారు. సముద్ర వాణిజ్య రంగంలో పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారుమాకు పొడవైన తీర ప్రాంతం ఉందిమా దగ్గర అంతర్జాతీయ స్థాయి ఓడరేవులున్నాయిమౌలిక వసతులుఆవిష్కరణలుసంకల్పం మా వద్ద ఉన్నాయిరండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి అని శ్రీ మోదీ కోరారు.

భారత్‌కున్న వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం, ఆధునిక నౌకా మౌలికవసతులుఆవిష్కరణల పట్ల అంకితభావం గురించి లింక్డిన్ పేజీలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి వివరించారుఇవి నౌకా నిర్మాణంఓడరేవులో కార్యకలాపాలుసరకు రవాణాతీరప్రాంత షిప్పింగ్అనుబంధ సేవల్లో పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను ఎలా అందిస్తున్నాయో తెలియజేశారు.

7,500 కి.మీ.కు పైగా ఉన్న తీర ప్రాంతంతో.. అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయిలో విస్తరిస్తున్న నౌకాశ్రయాలతో.. ప్రధాన సముద్ర వాణిజ్య కేంద్రంగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారురవాణా అనుసంధానాన్ని మాత్రమే కాకుండా.. విలువ ఆధారిత సేవలుహరిత నౌకా రవాణా కార్యక్రమాలుపారిశ్రామిక అనుకూల విధానాలను అందిస్తోందన్నారు.

‘‘రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి’’ అని దేశీయఅంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారుఅలాగే విస్తృతమైన మౌలిక వసతులుస్పష్టమైన ఆలోచనఅభివృద్ధి చెందుతున్న నూతన ఆవిష్కరణ వ్యవస్థలతో కూడిన దేశ సముద్ర వాణిజ్య ప్రగతి గాథలో భాగం కావాల్సిందిగా కోరారు.

లింక్డిన్‌లో రాసిన తన ఆలోచనలను ఎక్స్‌లో ప్రధానమంత్రి పంచుకుంటూ..:

సముద్ర వాణిజ్య రంగంలో పెట్టుబడులకు భారత్ సరైన గమ్యస్థానం.

మా దేశానికి పొడవైన తీర ప్రాంతం ఉంది.

మా దగ్గర ప్రపంచ స్థాయి ఓడరేవులున్నాయి.

మా వద్ద మౌలిక వసతులు, ఆవిష్కరణసంకల్పం ఉన్నాయి.

రండి, భారత్‌లో పెట్టుబడులు పెట్టండి!

లింక్డిన్‌లో కొన్ని ఆలోచనలు పంచుకున్నాను.’’

@LinkedIn.”

 


(Release ID: 2184238) Visitor Counter : 9