ప్రధాన మంత్రి కార్యాలయం
‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తితో విస్తరిస్తున్న, స్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటు
ఆధునికీకరణ, యాంత్రీకరణ, రద్దీగా ఉండే తూర్పు, పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణ ప్రయత్నాలపై కథనాన్ని పంచుకున్న ప్రధాని
Posted On:
23 OCT 2025 12:36PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రచించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తితో విస్తరిస్తున్న, స్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటు ఆధునికీకరణ, యాంత్రీకరణ, రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణకు చేపడుతున్న ప్రయత్నాలు దేశానికి ప్రత్యేక ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నదీ శ్రీ సర్భానంద సోనోవాల్ ఈ కథనంలో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాసిన కథనానికి శ్రీ మోదీ స్పందిస్తూ..:
‘‘ఇది కచ్చితంగా చదవాల్సిన కథనం. ‘మేకిన్ ఇండియా’ అందిస్తున్న ప్రోత్సాహంతో విస్తరిస్తున్న, స్థిరత్వం సాధిస్తున్న పారిశ్రామిక రంగంతో పాటుగా ఆధునికీకరణ, యాంత్రీకరణ, రద్దీగా ఉండే తూర్పు - పశ్చిమ వాణిజ్య మార్గంతో సహా పోర్టుల డిజిటలీకరణ ప్రయత్నాలు దేశానికి ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వివరించారు.
భారతీయ నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 8 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఓ సాధారణమైన బడ్జెట్ లాంటిది కాదని, అది ఆశయ సాధనకు సూచన అని ఆయన వివరించారు.’’
***
(Release ID: 2181795)
Visitor Counter : 9
Read this release in:
Manipuri
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada