ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించిన భారత ప్రధాని

Posted On: 07 OCT 2025 8:20PM by PIB Hyderabad

గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

భారత్ - అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనదని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“గౌరవనీయులు వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని మేధావులు, వ్యాపార వేత్తలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో సంభాషించడం సంతోషాన్నిచ్చింది. భారత్ - అమెరికా సంబంధాల బలోపేతంలోనూ.. అలాగే ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ వారి కృషి ఎంతో విలువైనది.

@wrmead”

 

(Release ID: 2176081) Visitor Counter : 3