ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్‌లోని రెండు ప్రాంతాలు రాంసార్ కేంద్రాలుగా గుర్తింపు పొందటాన్ని భారతదేశ చిత్తడి నేలల సంరక్షణలో కీలక ఘట్టంగా పేర్కొన్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2025 6:00PM by PIB Hyderabad
ఈ రోజు రాంసార్ కేంద్రాలుగా బీహార్‌కు చెందిన బక్సర్ జిల్లాలో గోకుల్ జలషాయ్ (448 హెక్టార్లు), పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉదయపూర్ ఝీల్ (319 హెక్టార్లు) గుర్తింపు పొందటం... భారతదేశ పర్యావరణ పరిరక్షణకు గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన పోస్టుపై ఈ విధంగా స్పందించారు:
"అద్భుతమైన వార్త! సుస్థిరాభివృద్ధికి చిత్తడి నేలల చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణలో ముందు వరుసలో ఎలా ఉండాలన్న విషయాన్ని ఆలోచన, కార్యాచరణలో చూపిస్తున్న బీహార్ ప్రజలకు ప్రత్యేక ప్రశంసలు."
(రిలీజ్ ఐడి: 2172362)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam