ప్రధాన మంత్రి కార్యాలయం
స్వదేశీ స్ఫూర్తిని ప్రతిబింబించే బీఎస్ఎన్ఎల్ 4జీ స్టాక్ కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 SEP 2025 10:22AM by PIB Hyderabad
బీఎస్ఎన్ఎల్ 4జీ స్టాక్ స్వదేశీ స్ఫూర్తిని ఎలా ప్రతిబింబిస్తుందో స్పష్టం చేసే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టుకు ప్రతిస్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"4జీ స్టాక్ స్వదేశీ స్ఫూర్తిని ఎలా ప్రతిబింబిస్తుందో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా స్పష్టంగా తెలియజేశారు. 22 మిలియన్ల మంది భారతీయులను అనుసంధానించే 92,000కు పైగా సైట్లతో ఇది భారత్ ఇతరులపై ఆధారపడటం నుంచి విశ్వాసం, ఉపాధి, ఎగుమతులు, ఆర్థిక పునరుజ్జీవనం, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడం వరకు సాగించిన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది."
(रिलीज़ आईडी: 2172268)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam