ప్రధాన మంత్రి కార్యాలయం
ఆహార శుద్ధి రంగంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచడంలో జీఎస్టీ సరికొత్త సంస్కరణల ప్రభావంపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
19 SEP 2025 12:01PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. జీఎస్టీ లో తాజాగా ప్రవేశపెట్టిన సంస్కరణలు కేవలం సాంకేతిక పరమైన మార్పులు కాదనీ, జీవన సౌలభ్యాన్నీ, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్నీ, పెట్టుబడి పెట్టడంలో సౌలభ్యాన్నీ పెంచే సాహసిక నిర్ణయాలని మంత్రి తన వ్యాసంలో అభివర్ణించారు. ‘‘నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలతో పాటు ప్యాకేజింగ్‌పై కూడా రేట్లను తగ్గించడంతో, రోజువారీ వాడుకొనే సరకులు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయి.. ఎంఎస్ఎంఈలకు ఊతం, రైతులకు మద్దతూ లభిస్తాయి.. ఆహార వస్తువుల రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడే తీరు కూడా మెరుగవుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ ఇలా స్పందించారు:
‘‘జీఎస్టీలో తీసుకువచ్చిన సరికొత్త సంస్కరణలు ఒక్క సాంకేతిక పరమైన మార్పులు మాత్రమే కాదు.. అవి జీవన సౌలభ్యాన్నీ, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్నీ, పెట్టుబడి పెట్టడంలో సౌలభ్యాన్నీ పెంచే సాహసిక నిర్ణయాలు అని కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు. నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలతో పాటు ప్యాకేజింగ్‌పై కూడా రేట్లను తగ్గించడంతో, రోజువారీ వాడుకొనే సరకులు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయి. ఎంఎస్ఎంఈలకు ఊతం, రైతులకు మద్దతూ లభిస్తాయి. ఆహార వస్తువుల రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడే తీరు కూడా మెరుగవుతుంది.’’
***
(Release ID: 2168772)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam