ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరిశుభ్రమైన వీధులు, అందమైన ఇళ్లు, పరుగులు తీసే మెట్రోలు, హరిత నగరాలు... ప్రభుత్వ నిబద్ధతతోనే.. అంటున్న వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

Posted On: 15 SEP 2025 1:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్నారుఈ వ్యాసంలో.. పరిశుభ్రమైన వీధులు, అందమైన ఇళ్లుపరుగులు తీసే మెట్రోలతో పాటు పచ్చదనం నిండిన నగరాలు వెలిసేలా ప్రభుత్వం నిరంతరాయంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందీ తెలిపిన వివరాలు ఈ వ్యాసంలో ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో కేంద్ర మంత్రి శ్రీ  హర్‌దీప్ సింగ్ పురీ పోస్టునకు ప్రధాని స్పందించారు:


 

‘‘భారతదేశంలోని నగరాలు అభివృద్ధికి దోహద పడుతున్నాయి!
స్వచ్ఛమైన వీధులుఅందమైన ఇళ్లువేగవంతమైన మెట్రోలు సహా పచ్చని చెట్లతో కళకళలాడుతున్న నగరాలకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నాలు ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ  హర్‌దీప్ సింగ్ పురీ (@HardeepSPuri) వివరించారు.
ఒక సరికొత్త పట్టణ భారతం ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నదీ తెలుసుకోవడానికి ఈ కింది లింకును క్లిక్ చేసి చదవండి...
https://www.hindustantimes.com/opinion/theres-a-new-urban-india-in-the-making-101757865213171.html
నమో యాప్ (NaMo App) లో..” అని పేర్కొన్నారు.‌

 

 

***

MJPS/SR


(Release ID: 2166910) Visitor Counter : 2