ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలో ఐఐఎం ఏర్పాటుకు సంబంధించి అభినందనలు తెలిపిన ప్రధాని
प्रविष्टि तिथि:
20 AUG 2025 7:48PM by PIB Hyderabad
అస్సాంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సాం ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
ఐఐఎం ఏర్పాటు వల్ల విద్యా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, దేశం నలుమూలల నుంచి విద్యార్థులతో పాటు పరిశోధకులు అక్కడికి వస్తారని మోదీ అన్నారు.
అస్సాంలో ఐఐఎం ఏర్పాటు గురించి కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌పై మోదీ ఈ విధంగా స్పందించారు:
"అస్సాం ప్రజలకు అభినందనలు. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు అనేది విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. భారతదేశం నలుమూలల నుంచి విద్యార్థులతో పాటు పరిశోధకులను ఆకర్షిస్తుంది."
(रिलीज़ आईडी: 2158729)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam