ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని మోదీని కలిసిన ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

प्रविष्टि तिथि: 18 AUG 2025 3:14PM by PIB Hyderabad

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి తిరు సీపీ రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.


"ఎక్స్" లో చేసిన పోస్ట్ లో శ్రీ మోదీ ఇలా రాశారు:

"తిరు సీపీ రాధాకృష్ణన్ ని కలిశాను. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనందుకు నా శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన సుదీర్ఘ ప్రజా సేవ, వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవం మన దేశానికి ఎంతో ఉపకరిస్తుంది. ఆయన ఇప్పటివరకు చూపించిన అంకితభావం, దృఢ సంకల్పాన్ని కొనసాగిస్తూ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను.
@CPRGuv"


(रिलीज़ आईडी: 2157591) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam