ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జల్ జీవన్ మిషన్‌కు 6 సంవత్సరాలు!…


దేశంలో 15 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు: ప్రధానమంత్రి

Posted On: 14 AUG 2025 1:41PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్‌’ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుకుళాయి కనెక్షన్లతో ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ద్వారా లక్షలాది కుటుంబాల్లో గొప్ప మార్పు చోటుచేసుకుందని ఆయన తెలిపారు.

2019లో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్‌... పరిమితకాలంలోనే 15 కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించిందిప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం.. ఆరోగ్యాన్నీసాధికారతనూ కల్పించడంతో పాటు కలల్ని నెరవేర్చుకునేలా ప్రజలకు తోడ్పాటును అందించింది.

ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచిందనీదీనితో పాటు ఆరోగ్య సంరక్షణను చాలా వరకు మెరుగుపరించిందనీముఖ్యంగా భారత్ నారీశక్తి అయిన మహిళలకు ప్రయోజనం కలిగించిందనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టులకు శ్రీ మోదీ ప్రతిస్పందించారు:

‘‘మన జల్ జీవన్ మిషన్‌కు సంవత్సరాలు పూర్తయిన (#6YearsOfJalJeevanMission) సందర్భాన్ని పండుగ చేసుకొంటున్నాంఇది మనిషి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటు మానవ జీవనంలో మార్పును తీసుకురావడంపై కూడా దృష్టి కేంద్రీకరించిన పథకంఇది మెరుగైన ఆరోగ్యసంరక్షణను కూడా అందించిందిముఖ్యంగా దీంతో నారీ శక్తికి చక్కని ప్రయోజనం కలిగింది.’’

‘‘దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ సాధించిన ఫలితాలను కళ్లకు కట్టే దృశ్యాలివిగో’’

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘జల్ జీవన్ మిషన్‌’ (#6YearsOfJalJeevanMission)”


(Release ID: 2156405)