ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అధికారిక పర్యటన: ఒప్పందాలు/ఎంవోయూలు
Posted On:
05 AUG 2025 4:31PM by PIB Hyderabad
క్ర. సం.
|
ఒప్పందం/ అవగాహన ఒప్పందం
|
1.
|
భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుపై ప్రకటన
|
2.
|
భారత్-ఫిలిప్పీన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం: కార్యాచరణ ప్రణాళిక (2025-29)
|
3.
|
భారత్, ఫిలిప్పీన్స్ వైమానిక దళాల మధ్య వైమానిక సిబ్బంది సమావేశాలపై నిర్దేశక నియమాలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)
|
4.
|
భారత్, ఫిలిప్పీన్స్ సైన్యం మధ్య మిలిటరీ సిబ్బంది దౌత్య సమావేశాలకు సంబంధించి నిర్దేశక నియమాలు
|
5.
|
భారత్, ఫిలిప్పీన్స్ నావికా దళాల సమావేశాలపై నిర్దేశక నియమాలు
|
6.
|
నేర సంబంధిత విషయాల్లో పరస్పరం చట్టపరమైన సాయంపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం
|
7.
|
శిక్ష పడిన వ్యక్తుల బదిలీపై భారత, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం
|
8.
|
భారత్, ఫిలిప్పీన్స్ శాస్త్ర - సాంకేతిక శాఖల మధ్య 2025-2028 కాలానికి శాస్త్ర సాంకేతిక రంగంలో సహకార కార్యక్రమం
|
9.
|
ఫిలిప్పీన్స్ ప్రభుత్వ పర్యాటక విభాగం, భారత పర్యాటక మంత్రిత్వ శాఖల మధ్య పర్యాటక సహకార ఆచరణ కార్యక్రమం (2025-2028)
|
10.
|
డిజిటల్ సాంకేతికతల రంగంలో సహకారంపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.
|
11.
|
శాంతియుతంగా అంతరిక్ష వినియోగంలో సహకారం దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఫిలిప్పీన్స్ అంతరిక్ష సంస్థ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్)
|
12.
|
భారత్, ఫిలిప్పీన్స్ తీర రక్షక దళాల మధ్య సముద్ర సహకారాన్ని మెరుగుపరిచేలా నిర్దేశాత్మక నిబంధనలు
|
13.
|
భారత్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య సాంస్కృతిక వినిమయ కార్యక్రమం
|
ప్రకటనలు:
1) ఫిలిప్పీన్స్ సార్వభౌమ డేటా క్లౌడ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో ప్రయోగాత్మక ప్రాజెక్టుకు భారత్ మద్దతు.
2) హిందూ మహా సముద్ర ప్రాంత సమాచార సమ్మేళన కేంద్రం (ఐఎఫ్సీ- ఐవోఆర్)లో పాల్గొనాల్సిందిగా ఫిలిప్పీన్స్‌కు ఆహ్వానం.
3) ఫిలిప్పీన్స్ దేశీయులకు ఉచిత ఇ-టూరిస్ట్ వీసా సౌకర్యం సంవత్సర కాలానికి (ఆగస్టు 2025 నుండి) పెంపు.
4) భారత్-ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంయుక్తంగా స్టాంపు విడుదల.
5) భారత్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం (ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్)పై చర్చలకు సంబంధించి నియమ నిబంధనలకు ఆమోదం.
***
(Release ID: 2152835)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam