ప్రధాన మంత్రి కార్యాలయం
నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపై ప్రధాని సంతాపం
Posted On:
14 JUL 2025 11:44AM by PIB Hyderabad
నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపట్ల భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలను, సంభాషణలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. మహమ్మదు బుహారీ మేధస్సు, ఆత్మీయత, భారత్ - నైజీరియా మైత్రిపట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధత చెప్పుకోదగ్గవన్నారు. మహమ్మదు బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి, ప్రజలకు... 140 కోట్ల భారతీయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతి అత్యంత బాధాకరం. వివిధ సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలు, చేసిన సంభాషణలు నాకు గుర్తొస్తున్నాయి. ఆయన పరిణతి, ఆత్మీయత, భారత్ - నైజీరియా మైత్రిపై ఆయనకున్న అచంచల విశ్వాసం ఎనలేనివి. మహమ్మదు బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి, ప్రజలకు... 140 కోట్ల భారతీయుల తరఫున నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
@officialABAT
@NGRPresident”
(Release ID: 2144555)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam