ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతి పట్ల ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 14 JUL 2025 3:40PM by PIB Hyderabad

ప్రముఖ సినీతార బిసరోజా దేవి మరణంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

భారతీయ సినిమాసంస్కృతికి ప్రతీకగానూఅసాధారణ నటిగానూ ఆమె గుర్తుండిపోతారని శ్రీ మోదీ అన్నారుఆమె తన నటవైవిధ్యంతో అన్ని తరాలపైనా చెరగని ముద్ర వేశారని కొనియాడారువివిధ భాషల్లోఅనేక ఇతివృత్తాల్లో నటన ద్వారా ఆమె బహుముఖీన ప్రజ్ఞను ప్రదర్శించారని అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి గారి మరణం బాధాకరం. భారతీయ సినిమాసంస్కృతికి ప్రతీకగాఒక అసాధారణ నటిగా ఆమె గుర్తుండిపోతారుఆమె తన నటవైవిధ్యంతో అన్ని తరాలపైనా చెరగని ముద్ర వేశారువివిధ భాషల్లోఅనేక ఇతివృత్తాల్లో ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఆమె కుటుంబానికీఅభిమానులకూ నా ప్రగాఢ సానుభూతిఓం శాంతి.” 


(రిలీజ్ ఐడి: 2144549) సందర్శకుల సూచీ సంఖ్య : : 34