ప్రధాన మంత్రి కార్యాలయం
శాన్ మార్టిన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛంతో నివాళులర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
06 JUL 2025 12:52AM by PIB Hyderabad
అర్జెంటీనా జాతిపిత జనరల్ జోస్ డి శాన్ మార్టిన్‌కు నివాళులర్పించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ దేశంలో అధికారిక పర్యటనను ప్రారంభించారు.
అర్జెంటీనాలోని ప్లాజా శాన్ మార్టిన్‌ను ప్రధానమంత్రి మోదీ సందర్శించారు. అర్జెంటీనాతో పాటు అనేక ఇతర దక్షిణ అమెరికా దేశాల విముక్తికర్త అయిన జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ స్మారక చిహ్నం వద్ద ఆయనకు నివాళులర్పించారు. ఆయన సహకారాన్ని, నిలబెట్టిన విలువలను భారత్ గౌరవిస్తోంది. అర్జెంటీనా హీరో పేరు మీద ఢిల్లీలో ఉన్న ఒక రహదారి ఆయన ఘన వారసత్వాన్ని గుర్తు చేస్తూనే ఉంటోంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు చిహ్నంగా నిలుస్తోంది.
(Release ID: 2142620)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam