ప్రధాన మంత్రి కార్యాలయం
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం.. ప్రధానమంత్రి సంతాపం
Posted On:
21 APR 2025 2:20PM by PIB Hyderabad
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఎక్స్’’ వేదికలో ప్రధాని తన సందేశాన్ని పొందుపరుస్తూ….
‘‘పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ అస్తమించారని విని నేనెంతో కలత చెందాను. ఈ విషాద ఘడియలో ఆయన జ్ఞాపకాలెన్నెన్నో నా మదిలో వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్త కేథలిక్ సముదాయానికి నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయ, కరుణ, ఆధ్యాత్మిక తేజస్సుకీ ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్‌ను అన్ని దేశాల ప్రజలూ ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఆయన తన చిన్న వయస్సులోనే జీసస్ ఆశయాలను నెరవేర్చడానికి అంకితమయ్యారు. పేదలకు, పీడిత తాడిత వర్గాల వారికి ఎంతో శ్రద్ధతో, తత్పరతతో సేవలందించారు. బాధాతప్తుల మదిలో ఆశల దీపాన్ని వెలిగించారు.
పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన సందర్భాలు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అభివృద్ధి అన్ని రంగాలలో చోటు చేసుకోవాలనీ, ప్రగతి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల వారికీ అందాలనీ ఆయన చాటిన నిబద్ధత నాకేంతో ప్రేరణనిచ్చింది. భారతీయుల పట్ల ఆయన కనబర్చిన ఆప్యాయత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన పవిత్ర ఆత్మకు ఆ దైవం శాశ్వత శాంతిని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2123322)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam