ప్రధాన మంత్రి కార్యాలయం
ముద్ర యోజన పదో వార్షికోత్సవం... ఈ పథకం గణనీయ ప్రభావాన్ని చూపుతోందంటూ ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
08 APR 2025 9:08AM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ (పీఎంఎంవై) అమలులోకి వచ్చి పదేళ్లు కావడాన్ని (#10YearsOfMUDRA) దేశం పండుగ చేసుకొంటున్న వేళ ఈ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కలలను సాకారం చేసుకొనే అవకాశాలను కల్పించడంలో ముద్ర పథకానికి పదేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పండుగ చేసుకోవడంతోపాటు ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల వారికీ చేరేటట్లు చూస్తూ ఆదరణకు నోచుకోని వర్గాల వారి అభ్యున్నతికి తోడ్పడడంలోనూ, దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందించడంలోనూ కీలక పాత్రను పోషిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
ఎక్స్‌లో కొన్ని సందేశాలను ప్రధాని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, మనం ముద్ర పథకానికి పదేళ్లు పూర్తి అయిన ఘట్టాన్ని (#10YearsOfMUDRA) ఓ వేడుకగా జరుపుకొంటున్న వేళ ఈ పథకం చలవతో తమ జీవనంలో గణనీయమైన మార్పులు తెచ్చుకున్న వారందరికీ నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పది సంవత్సరాల్లో ముద్ర యోజన ఎంతో మంది కన్న కలలను నిజం చేసింది. ఇదివరకు ఉపేక్షకు గురి అయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారు రాణించే అవకాశాన్ని కల్పించింది. భారతీయులకు ఏదీ అసాధ్యం కాదని ఈ పథకం చాటిచెబుతోంది.’’
‘‘ముద్ర లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన సముదాయాల వారు ఉండడంతోపాటు లబ్ధిదారుల్లో 70 శాతం మందికి పైగా మహిళలే ఉండడం చాలా సంతోషం. ప్రతి ముద్రా రుణం గౌరవాన్నీ, ఆత్మ గౌరవాన్నీ, అవకాశాన్నీ ప్రసాదిస్తోంది. అన్ని వర్గాల వారినీ ఆర్థిక సేవలకు చేరువగా తీసుకురాడానికి తోడు, ఈ పథకం సామాజిక సంఘటితత్వానికీ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ దన్నుగా నిలిచింది.’’
‘‘రాబోయే సంవత్సరాల్లోనూ, మా ప్రభుత్వం ఒక పక్కా అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. జీవనంలో ముందడుగు వేయాలని తపించే ప్రతి ఒక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తకూ ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ రుణాన్ని అందించి అతడికి లేదా ఆమెకు ఆత్మ విశ్వాసాన్నీ, వృద్ధిలోకి వచ్చే అవకాశాన్నీ అందిస్తుంది.’’
***
(Release ID: 2120014)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam