ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, వన్యప్రాణుల్ని చూడడానికి ఈ రోజు ఉదయం గిర్ వెళ్లాను.. అది రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల ఆవాసమని మనకందరికీ తెలుసు; గిర్ చేరుకోవడంతో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలసి పూర్తి చేసిన పనుల జ్ఞాపకాలెన్నో మదిలో మెదిలాయి: ప్రధానమంత్రి
* గత కొన్నేళ్లలో సమష్టిగా చేసిన ప్రయత్నాలతో ఆసియాకు చెందిన సింహాల సంఖ్య పెరుగుతూపోతోంది; ఆసియా సింహాల నివాస స్థానాలను పరిరక్షించడంలో పరిసర ప్రాంతాల గిరిజన సముదాయాలు, మహిళలు పోషించిన పాత్ర కూడా ప్రశంసనీయమే: ప్రధాని
Posted On:
03 MAR 2025 12:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.
ఈ సందర్శనను గురించి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:
‘‘ఈ ఉదయం, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (#WorldWildlifeDay) సందర్భంగా, వన్యప్రాణులను గమనించడానికి గిర్ వెళ్లాను. మనకందరికీ తెలుసు.. గిర్ రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల నిలయమని. అక్కడికి చేరుకోవడంతోనే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేమందరం కలసి చేపట్టిన పనుల జ్ఞాపకాలనేకం ఒక్కసారిగా నా మదిలో మెదిలాయి. చాలా ఏళ్లపాటు చేసిన ఉమ్మడి ప్రయత్నాల వల్ల ఆసియా సింహాల సంఖ్య పెరుగుతూపోతోంది. ఆసియా సింహాల నివాసస్థానాన్ని పరిరక్షించడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజన సముదాయాలు, మహిళలు పోషించిన పాత్ర కూడా అంతే ప్రశంసనీయంగా ఉంది.’’
‘‘గిర్‌కు సంబంధించిన మరికొన్ని దృశ్యాలు ఇవిగో. రాబోయే కాలంలో మీరంతా గిర్ సందర్శించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను.’’
‘‘ఈ ఉదయం గిర్ వెళ్లి అక్కడ సింహాలతోపాటు ఆడసింహాలను చూశాను. కొన్ని ఫోటోలను కూడా తీశాను.’’
*********
MJPS/SR/SKS
(Release ID: 2107737)
Visitor Counter : 19
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam