రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం

Posted On: 25 JAN 2025 7:17PM by PIB Hyderabad

నా  ప్రియమైన సహ పౌరులారా నమస్కారం.

1. చారిత్రాత్మకమైన సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. మీకు నా హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు. 75 సంవత్సరాల క్రితం జనవరి 26వ తేదీన మన ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం అమల్లోకివచ్చింది.

2. దాదాపు మూడేళ్ల పాటు విస్తృతంగా చర్చలు జరిపిన రాజ్యాంగ పరిషత్ సభ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్నిఆమోదించింది. ఆ రోజును 2015 సంవత్సరం నుంచి సంవిధాన్ దినోత్సవంగా..అంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

3. గణతంత్ర దినోత్సవం మనపౌరులందరికీ సమిష్టి ఆనంద, గర్వ కారణమైన సందర్భం. ఒక జాతి మనుగడలో 75 సంవత్సరాల కాలం కేవలం లిప్త పాటు అని అంటూ ఉంటారు. కానీ భారత్ విషయంలో ఈ 75 ఏళ్ళ కాలం గురించి అలా చెప్పలేమని నేనంటాను. నిద్రాణమై ఉన్న మన జాతి ఆత్మ మళ్లీ జాగృతమై, ప్రపంచ దేశాల సమూహంలో తన స్థానాన్నితిరిగి సంపాదించుకొనేందుకు వడివడిగా ముందుకు అడుగులు వేసిన కాలం ఇది. ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికతల్లో ఒకటి అయిన భారత్ విజ్నానానికి, వివేకానికి మూలాధారంగా ఒకప్పుడు నిలిచింది. మధ్యలో కొన్ని చీకటి రోజులు వచ్చి వలస పాలనలో దారుణమైన అమానుషమైన దోపిడీవల్ల మనదేశంలో పేదరికం వ్యాపించింది.

4. విదేశీ పాలన శృంఖలాల నుంచి మాతృభూమిని విడిపించేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన వీరులను ఈ రోజు మనం మొదట గుర్తుచేసుకోవాలి. వారిలో కొంత మంది జాతికి సుపరిచితులే అయినా, మరి కొంత మంది గురించి ఇటీవలికాలం వరకు ప్రజలకు అంతగా తెలీదు.  దేశ చరిత్రలో కీలకపాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రతినిధిగా నిలిచిన భగవాన్ బిర్సాముండా 150వ జయంతిని ఏడాది మనం జరుపుకుంటున్నాం. జాతీయ చరిత్రలో వారి కృషికి ఇప్పుడు మనం తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం.

5. 20వ శతాబ్దం మొదటి దశాబ్దాల్లో   జరిపిన పోరాటాలు ఒక దేశవ్యాప్త స్వాతంత్ర సమరంగా ఏకీకృతంఅయ్యాయి. మనదేశ ప్రజాస్వామ్య విలువలకు తిరిగి ప్రాణం పోయటంలో మార్గదర్శనం చేసిన మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ఠాగూర్, బాబాసాహెబ్ అంబేద్కర్వంటినాయకులు దేశంలో ఉండడం కేవలం దేశ ప్రజల అదృష్టం.  న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేది పుస్తకాల్లో ఉండే సిద్ధాంతాలు, భావనలు మాత్రమే కాదన్నవిషయాన్ని మనం ఆధునిక కాలంలోతెలుసుకున్నాము. ఈ జీవన విలువలు మననాగరికతా వారసత్వంలో ముందు నుంచిఅంతర్భాగాలే. భారత్ స్వాతంత్రం సాధించిన నాటి నుంచి మన రాజ్యాంగం, గణతంత్ర భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా మాట్లాడిన విమర్శకుల మాటలుతప్పని,ఈ విలువల బలంపైనే మనంరుజువుచేయగలిగాము.

6. మన రాజ్యాంగ పరిషత సభ స్వరూపం కూడా మన గణతంత్ర విలువల ప్రతిబింబం అని చెప్పాలి. దేశంలోఅన్నిభాగాలు, అన్నిప్రాంతాలు, వర్గాల ప్రతినిధులు సభలో సభ్యులుగా ఉన్నారు.  ముఖ్యంగా, సరోజినీనాయుడు రాజకుమారిఅమృత్కౌర్, సుచేతకృపలానీ, హంసబెన్ మెహతా, మాలతిచౌదరి వంటి దిగ్గజాలైన 15 మందిమహిళలు కూడాసభలో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మహిళా సమానత్వ అనేది ఒక సుదూరమైన ఆదర్శంగా ఉన్నకాలంలోనే భారత మహిళలు దేశభవిష్యత్తును తీర్చిదిద్దడంలో తమవంతు పాత్రను నిర్వర్తించారు.

7. నాగరికత విలువలు అనేవి అనేక శతాబ్దాలుగా మనదేశానికి నైతికదిక్సూచిలో భాగంగాఉన్నకారణంగా మనరాజ్యాంగం ఒకసజీవ, ఆచరణాత్మక పత్రంగా రూపుదిద్దుకుంది.  భారతీయులుగా మనసమిష్టి గుర్తింపునకు రాజ్యాంగం అత్యున్నతమైన పునాదిగానిలిచింది.  మన అందరిని ఒకే కుటుంబంగా రాజ్యాంగం ఒక తాటి పైకి తీసుకొని వచ్చింది. ఇప్పటికే  75  సంవత్సరాల కాలం నుంచి మన ప్రగతి పయనానికి ఈ పత్రం మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. ఈ రోజు మనం రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడైన డాక్టర్అంబేద్కర్కు, రాజ్యాంగ పరిషత్ సభలో ఇతర విశిష్ట సభ్యులకు, ఈ పనికి సంబంధించి అజ్ఞాతంగా, అవిశ్రాంతంగా పని చేసిన అనేక మంది అధికారులకు, మనకి ఇంత అమూల్యమైన పత్రాన్నివారసత్వంగా ఇచ్చినందుకు ఈనాడు ధన్యవాదాలు తెలియజేసుకుందాం.

ప్రియమైన దేశ ప్రజలారా,

8. 75 సంవత్సరాల రాజ్యాంగ చరిత్రలో యువ గణతంత్రం అయిన మనదేశం సర్వతోముఖాభివృద్ధిసాధించింది. స్వాతంత్రం సాధించిన సమయంలోనూ, తర్వాత కూడా దేశంలో అధిక భాగాల్లో తీవ్రమైన పేదరికం ఆకలి నెలకొన్నాయి. అయితే సమయంలో కూడా మన ఆత్మవిశ్వాసం లో మాత్రం ఎటువంటి కొరతలేదు. ప్రగతి సాధించేందుకు అవసరమైన అవకాశాలు ప్రతి ఒక్కరికి లభించేలా సానుకూలమైన పరిస్థితులను మనంకల్పించాము.  మన రైతులు చమటోడ్చి కృషి చేసి ఆహార ఉత్పత్తిలో మనదేశానికి స్వాలంబన కల్పించారు. మన కార్మికులు అవిశ్రాంతంగా పనిచేసి  మన మౌలికసదుపాయాలు తయారీరంగాలను పరివర్తనం చేశారు. వారి విశేషమైన ప్రయత్నాల కారణంగా ఈనాడు భారత అర్ధవ్యవస్థ, ప్రపంచ ఆర్థిక సరళిపైన ప్రభావంచూపుతోంది. అంతర్జాతీయ వేదికలపై ఈనాడు భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోంది.  రాజ్యాంగం నిర్ధేశించిన పరిధిని అనుసరించనిదే పరివర్తన సాధ్యపడేది కాదు.

9. గత కొన్ని సంవత్సరాల్లో మన దేశంలో ఆర్థికవృద్ధి రేటు నిరంతరం పెరుగుతోంది. యువజనులకు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పన జరిగి రైతులు కార్మికుల చేతుల్లో మరిన్నిడబ్బులు చేరి, ప్రజలు పేదరికంలో నుంచి బయటకు రాగలుగుతున్నారు. సుదూరదృష్టితో, సాహసంతో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే ధోరణిని కొనసాగించేందుకు తోడ్పడతాయి. సమ్మిళిత సమానత్వం అనేది మన అభివృద్ధికి మూలంకాగా, అభివృద్ధి ఫలాలను వీలైనంత విస్తృతంగా పంచడంపైన మనం దృష్టిసారిస్తున్నాము.

10. ఆర్థిక సమానత్వానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రధాన మంత్రి జన ధన యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతిభీమాయోజన, ప్రధానమంత్రి సురక్షబీమాయోజన, ముద్రయోజన, స్టాండప్ఇండియా, అటాల్ పింఛను యోజన లాంటి వాటిని మరింత విస్తరించడం ద్వారా వివిధ ఆర్థిక సహాయ పధకాలను ప్రజలు అందుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

11. ప్రజా సంక్షేమం అనేదాన్ని ప్రభుత్వం పున్నిర్వచించటం కూడా అంతే ముఖ్యమైన మార్పు, దీంతో, ఇల్లు, తాగు నీరు లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం ఒక హక్కుగా భావించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.  అణగారిన వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్డ్కులాలు షెడ్యూల్డ్తెగలు ఇతర వెనుకబడిన తరగతుల వంటి వర్గాలకు చేయూత నిచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి, షెడ్యూల్డ్కులాలకు చెందిన యువజనులకు ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్స్కాలర్షిప్లు, జాతీయఫెలోషిప్లు, ఓవర్సీస్స్కాలర్షిప్తోపాటు హాస్టాల్ కోచింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. షెడ్యూల్డ్కులాల వారికి ఉపాధి, ఆదాయ కల్పన అవకాశాలు కల్పించి వారి పేదరికాన్ని తగ్గించడంలో ప్రధానమంత్రి అనుసూచి అభ్యుదయ యోజన గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. షెడ్యూల్డ్తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసి న్యాయమహాఅభియాన్,  అంటే పిఎం జన్మన్ పథకంమొదలైన పథకాలుప్రత్యేకంగాసహాయంఅందిస్తున్నాయి. డినోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార వర్గాల కోసం ఒక ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు.

12. మరో పక్క భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన రోడ్లు రైల్వేలు రేవులు లాజీస్టిక్స్కేంద్రాలతో సహా వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన గత దశాబ్ద కాలంగా దృష్టి పెట్టడంతో రానున్న అనేక దశాబ్దాల పాటు అభివృద్ధికి అవసరమైన మౌలికవ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

13. ఆర్థి కరంగంలో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన తీరు అత్యంత ఆసక్తికరమైనది. అనేక డిజిటల్చెల్లింపు ప్రత్యామ్నాయాలు, ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ సమానత్వాన్నిపెంచి, గణనీయమైన సంఖ్యలో ప్రజలను ఆర్థికవ్యవస్థలో భాగం చేయగలిగాయి. వ్యవస్థలోకి మునుపెన్నడూ లేని స్థాయిలో ఇవి పారదర్శకతను ప్రవేశపెట్టాయి. అతి కొద్ది సంవత్సరాలలోనే ప్రపంచంలోని అత్యుత్తమమైన వ్యవస్థలలో ఒకటైన పటిష్టమైన డిజిటాల్ ప్రజా సదుపాయాలవ్య వస్థను సృష్టించగలిగాము.

14. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ లాంటి సాహసోపేతమైన చర్యల పరంపర వల్ల బ్యాంకింగ్వ్యవస్థ కూడా ఆరోగ్యవంతమైన స్థితికి చేరుకొని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వ్యర్థ-ఆస్తులలో కూడా గణనీయమైన తగ్గుదల సాధ్యపడింది.

ప్రియమైనసహపౌరులారా,

15. 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, వలస పాలననాటి, అనేక బానిసత్వ అవశేషాలుమనమస్తిష్కాల్లో అనేక రోజుల పాటు మిగిలిపోయాయి. గత కొద్ది సంవత్సరాలలో మనం దృక్పథంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను చూస్తున్నాం. ఇండియన్పీనల్కోడ్, క్రిమినల్ప్రొసీజర్కోడ్, ఎవిడెన్స్యాక్టుల  స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యఅధినియంను ప్రవేశపెట్టడం ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గది. భారతీయ న్యాయ శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా రూపొందిన కొత్త నేర చట్టాలు శిక్షలు విధించడంపైన కాక న్యాయాన్నిఅందించే ముఖ్య ఉద్దేశంగా రూపు దిద్దుకున్నాయి. అంతేకాక,  మహిళలు పిల్లలపై నేరాల నిరోధానికి కొత్త చట్టాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.

16. ఆ స్థాయి లో సంస్కరణలు అమలు చేయాలంటే అత్యంత సాహసోపేతమైన దార్శనికత అవసరం. సుపరిపాలనకు అవసరమైన పునర్నిర్వచనం కోసంపార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒకబిల్లు దేశంలో అన్ని ఎన్నికలను ఒకే సమయంలో నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రణాళిక ద్వారా పరిపాలనలో స్థిరత్వం వస్తుంది. విధానపరమైన నిష్క్రియాత్మకత ఉండదు. వనరుల మళ్లింపు జరగదు.  ఆర్థిక భారాన్ని తగ్గించడం సహా అనేక ఇతర ప్రయోజనాలను కల్పించ గలుగుతారు.

17. మన సాంస్కృతిక సంపదతో తాజాగా పరిచయం మరింత గాఢమైంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభ మేళ …. సుసంపన్న వారసత్వానికి ఒకవ్యక్తికరణగా భావించవచ్చు. సాంస్కృతిక రంగంలో తీసుకుంటున్న అనేచర్యలు మన సంప్రదాయాలు, పద్ధతులను పరిరక్షించేందుకు పునరుజ్జీవంపచేసేందుకు తోడ్పడుతాయి.

18. భాష వైవిధ్యానికి కూడా భారత్ ఒక గొప్పకేంద్రం. సుసంపన్న వైవిధ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత భాషలను ప్రాచీన భాషలుగాప్రకటించింది. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు ఇప్పటికే శ్రేణిలో ఉన్నాయి. ఈ 11 ప్రాచీన భాషలపైన పరిశోధనలను ప్రభుత్వం ఇప్పుడు ఎంతగానోప్రోత్సహిస్తోంది.

19. గుజరాత్లోని వడ్ నగర్ లో తొలి పురావస్తు అనుభవ సంగ్రహాలయ నిర్మాణం పూర్తి కావస్తుడడం నాకు సంతోషంగా ఉంది.  క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల నాటి మానవ ఆవాసానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించిన ఓ క్షేత్రానికి దగ్గరగా మ్యూజియంను అభివృద్ధి పరుస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన కళలు హస్త కళలు సాంస్కృతిక వస్తువులను ఒకే చోట ప్రదర్శించేందుకు మ్యూజియం ఏర్పాటు అవుతుంది

ప్రియమైనసహపౌరులారా

20. రేపటి భారతదేశాన్ని రూపుదిద్దేది మన యువతరమే. యువత ఆలోచనా ధోరణికి దిశా నిర్దేశం చేసేది విద్య. అందువల్ల ప్రభుత్వం విద్యలో పెట్టుబడిని పెంచి రంగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంత వరకు సాధించిన ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పాలి. బోధన నాణ్యత, భౌతి కమౌలికసదుపాయాలు, డిజిటల్ సమానత్వ  విషయాల్లో కొత్త పరివర్తన వచ్చింది. బోధన మాధ్యమాల్లో వివిధ స్థాయిల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల ఫలితాలలో కూడా చెప్పుకోదగ్గ మెరుగుదల రావడంలో ఆశ్చర్యంలేదు.   పరివర్తనలో మహిళఉపాధ్యాయులు ఎంతో కీలకమైన పాత్ర పోషించిన విషయం నాకెంతగానో సంతోషం కలిగిస్తోంది. గత దశాబ్దకాలంలో ఉపాధ్యాయులైన వారిలో 60 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే కనుక ఇదిఅంతగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదనిచెప్పాలి.

21. వృత్తి విద్య, నైపుణ్య విద్యను విస్తృతం చేయడం, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కూడా స్వాగతించ దగ్గ పరిణామం. యువజనులకు కార్పొరేట్రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు ఇప్పుడు కొత్తగా మరొక పథకం ప్రారంభమైంది.

22. పాఠశాల స్థాయి విద్యలో పటిష్టమైన పునాది ద్వారావిజ్ఞానం, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో భారత్కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రపంచంలోనే మేధో సంపత్తి దరఖాస్తులకు సంబంధించి భారత్ ఆరవ స్థానంలో నిలిచింది. ప్రపంచ సృజనాత్మక సూచీలో మన స్థానం కూడా ఎప్పటి కప్పుడు మెరుగవుతూ 2020 నాటి  48వ స్థానంనుంచి 2024 లో 39వ ర్యాంకుకు చేరింది.

23. ఆత్మవిశ్వాసం పెరగడంతో మనం అత్యాధునిక పరిశోధనారంగంలో అనేక చర్యలతో మన భాగస్వామ్యాన్నిపెంచుతున్నాము. వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనలను ప్రోత్సహించి, పెంచేందుకు ‘నేషనల్ క్వాంటమ్ మిషన్’ ద్వారా ఉత్తేజకర వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. జాతీయ ఇంటర్ డిసిప్లీనర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ మిషన్ ద్వారా కృత్రిమ మేధస్సు, మెషిన్లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ భద్రత సహా అనేక సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇటీవలి కాలం వరకు భవిష్యత్ పరిజ్ఞానాలుగా పిలిచిన సాంకేతిక పరిజ్ఞానాలు ఇప్పుడు మన సాధారణ దైనందిన జీవితంలోభాగం కావడం ఆసక్తికరమైన అంశం.

24. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ప్రకృతి రహాస్యాలను సోధించే ఒక ఆసక్తి కరమైన ప్రాజెక్టు. అంతే కాకుండా మన దేశ శాస్త్ర విజ్ఞాన చరిత్రలో ఒక విలక్షణమైన మైలురాయి కూడా. ఈ ప్రధాన కార్యక్రమం కింద పదివేల మంది భారతీయుల జినోమ్సికే‌ఎస్ సీక్వెన్సింగ్ వివరాలను తర్వాతి పరిశోధన కోసం నెలలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో కొత్తమార్గాలు ఏర్పడి ప్రజా ఆరోగ్య సంరక్షణవ్య వస్థను మరింత బలోపేతం చేస్తుంది.

25. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో గతకొద్ది సంవత్సరాలుగా అనేక విధాల ప్రగతి సాధించింది. ఈనెల స్పోఎస్ డాకింగ్ ప్ర యోగం ద్వారా ఇస్రో మరోసారి ఉత్తేజం కలిగించి దేశప్రజలకు గర్వకారణమైంది. ప్రపంచంలోనే   సామర్థ్యం కల నాలుగవ దేశంగా మన దేశం నిలిచింది.

26. ఒక జాతిగా మన పెరుగుతున్న ఆత్మ విశ్వాసం క్రీడల రంగంలో కూడా ప్రతిఫలిస్తోంది. మన దేశానికి చెందిన క్రీడాకారులు ఇటీవల కాలంలో అనేక  విజయగాథలను రచించారు. గత ఏడాది ఒలింపిక్క్రీడల్లో మన క్రీడాకారులు పేరు  గడించడమే కాక ఒలింపిక్క్రీడల్లో మనం పంపిన క్రీడా బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజయగర్వంతో స్వదేశానికి తిరిగి వచ్చింది. మన చదరంగం క్రీడాకారులు ప్రపంచంలో మన దేశం సత్తాను చాటారు. fide చెస్ఒలింపియాడ్లో భారత పురుషులు, మహిళల చదరంగం క్రీడాకారులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2024 సంవత్సరంలో క్రీడా రంగంలో మన దేశం సాధించిన విజయాలకు అతి పిన్న వయస్కుడైన ప్రపంచ చాంపియంగా D గుకేష్ నిలవడం తల మానికంగా నిలిచింది.

27, క్షేత్ర స్థాయిలో శిక్షణ సౌకర్యాల్లో మెరుగుదల కారణంగా క్రీడాకారులు సమరోత్సాహంతో ముందుకు సాగి తర్వాతి తరం వారికి మరింత ఎత్తైనశిఖరాలను అధిరోహించాలన్న స్ఫూర్తిని కలిగించారు.

28. విదేశాల్లో ఉన్న మన సోదర సోదరీమణులు మన సంస్కృతి నాగరికతలో వైభవోపేతమైన అంశాలను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి, వివిధ రంగాల్లో విజయాలు సాధించి దేశానికి గర్వకారణమయ్యారు. భారత విజయపరంపరలో తాము కూడా ఒకభాగమేనని వారువిశ్వసిస్తారు. నెల ఆరంభంలో ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో నేను చెప్పినట్లు.... 2047 నాటికి  భారత్ ను వికసిత  భార్ట్ గా నిలబెట్టే ప్రక్రియలో వారు చురుకుగా ఉత్సాహంగా పాల్గొంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది.

ప్రియమైనసహపౌరులారా

29. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతి ద్వారా మనం తలఎత్తుకుని భవిష్యదభిముఖంగా ముందుకిసాగుతున్నాం. మన భవిష్యత్తుకి అత్యంత కీలకమైనది మన యువ శక్తి. ముఖ్యంగా, యువతీశక్తి. రేపటి భారత్ ను తీర్చిదిద్దడంలో, వారి కలలు కీలకం కాగా మనస్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే నాటికి మన దేశం వికసిత భారత్ గానిలుస్తుంది. 2050 జనవరి 26వ తేదీనాడు, ఇప్పటి తరం మన త్రివర్ణ పతాకానికి వందనంచేస్తూ, మన సాటిలేని రాజ్యాంగ మార్గదర్శకత్వం లేనిదే గొప్ప ప్రయాణం సాధ్యం అయ్యేది కాదని, తమ తదుపరి తరానికి చెప్తుండడం నేను ఊహించుకుంటున్నాను.

30. ప్రపంచ వేదికపై స్వతంత్ర్య భారత ఆధర్శాలను మన బావితరాలు చరితార్థం చేస్తాయి. జాతి పిత మహాత్మ గాంధీ సందేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను.

"స్వరాజ్యం మనని నాగరికులను చెయ్యకపోతే, మనని పవిత్రులను చేసి మన నాగరికతకు స్థిరత్వం ఇవ్వకపోతే, ఆ స్వరాజ్యానికి ఎటువంటి విలువలేదు. మన రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా నైతికతకు అత్యున్నత స్థానం ఇవ్వడమే మన నాగరికతసారంలో అత్యంతమౌలికమైనవిషయం" అని బాపుజీ అన్నారు.

31. గాంధీజీ కన్న కలలను సకారం చేస్తామని ఈరోజు మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం.  ఆయన సూచించిన సత్యం అహింస అనే విలువలు ప్రపంచం యావత్తుకు ఎప్పటికీ కీలక మంత్రాలుగా పని చేస్తాయి. హక్కులు బాధ్యతలు నాణానికి రెండువైపులని ఆయన నేర్పారు. మన కర్తవ్య నిర్వహణ ద్వారానే మనకు హక్కులు సంప్రాప్తిస్తాయి. అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఆయన నేర్పిన పాఠాలను కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. మన తోటి మనుషుల పట్ల మాత్రమేకాక మన నదులు-పర్వతాలు, చెట్లు-చేమలు, పశు-పక్షుల పట్ల కూడా మనం కరుణ పెంచుకోవాలి  అని గుర్తు చేసుకోవాలి.

 

32. వాతావరణ మార్పుల పైన పోరాటానికి మనం అందరం మనవంతు కృషి అందించాలి.   విషయంలోరెండు అత్యుత్తమమైన ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి భారత్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ అని ఒక ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు మరింత చురుకుగా పనిచేసేలాగా వ్యక్తులు సమాజాలకు స్ఫూర్తినందిస్తోంది. గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంనాడు మన తల్లుల ఆత్మీయతకు, ప్రకృతి మాత ప్రేమకు నివాళిగా ఏక్ ఫెడ్ మా కె నామ్ అనే మరొక ఉద్యమాన్ని కూడా ప్రారంభించుకున్నాము.  80 కోట్లమొక్కలు నాటాలన్న కార్యక్రమం లక్ష్యాన్ని, నిర్ణీత గడువుకి ఎంతో ముందుగానే సాధించడం విశేషం. ప్రజలు తమ సొంత ఉద్యమాలుగా లక్ష్యాలుగా భావించే ఇటువంటి సృజనాత్మకమైన ఉద్యమాల నుంచి ప్రపంచం ఎంతగానో నేర్చుకోవచ్చు.

ప్రియమైనసహపౌరులారా

33. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. మన సరిహద్దులకు కావలిగా నిలిచిన సైనికులకు, దేశ భద్రత కోసం సరిహద్దుల లోపల కృషి చేస్తున్నపోలీస్, పారా మిలిటరీ సిబ్బందికి కూడా నా శుభాకాంక్షలు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ, మన విదేశీ దౌత్య కార్యాలయాల్లో సిబ్బందికి కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేపట్టే ప్రతిపని లోనూ మీకు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను.

ధన్యవాదాలు జైహింద్, జైభారత్.

 

***


(Release ID: 2096254) Visitor Counter : 79