ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాడ్‌కాస్ట్ ను నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీ నిఖిల్ కామత్: పాలుపంచుకొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JAN 2025 7:57AM by PIB Hyderabad

 ఔత్సాహిక పారిశ్రామికవేత్త  శ్రీ నిఖిల్ కామత్ నిర్వహణలో రూపొందిన ఒక పాడ్‌కాస్ట్ లో ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని తన రాజకీయ ప్రస్థానాన్ని గురించి, తన వ్యక్తిగత దృష్టికోణాలను గురించి   విపులంగా వెల్లడించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను త్వరలో విడుదల చేయనున్నారు (డిజిటల్ ఫార్మేట్‌లో సిద్ధం చేసే ఒక ఆడియో లేదా వీడియో ప్రోగ్రాం ఫైల్‌నే పాడ్‌కాస్ట్‌గా వ్యవహరిస్తారు. దీనిని ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొనేందుకు వీలు ఉంటుంది).

శ్రీ నిఖిల్ కామత్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ,
‘‘ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో మేం ఎంతగా ఆనందాన్ని పొందామో ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీరు కూడా అంతే ఆనందిస్తారని  ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2092271) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam