ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, సమష్టి కృషికి ధన్యవాదాలు: ప్రధాని
प्रविष्टि तिथि:
03 DEC 2024 7:10PM by PIB Hyderabad
పులుల సంరక్షణలో సమష్టి కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో పులుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని ఈ రోజు తెలిపారు. దేశంలో 57వ పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం, ప్రకృతిని పరిరక్షించుకోవాలనే మన శతాబ్దాల నాటి సంప్రదాయానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ మోదీ ‘‘ప్రకృతిని పరిరక్షించాలనే శతాబ్దాల నాటి మన ఆచారానికి అనుగుణంగా పర్యావరణ ప్రేమికులకు శుభవార్త. సమష్టి కృషికి ధన్యవాదాలు, భారత్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2080439)
आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam