ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రీసు ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉభయుల మధ్యా అంగీకారం
పీఎం మిట్సుటాకీస్ భారత పర్యటన నేపథ్యంలో
ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, నౌకాయానం- అనుసంధానతలను సమీక్షించిన నేతలు
భారత్- మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్ధిక మండలితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ
Posted On:
02 NOV 2024 8:22AM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గ్రీసు ప్రధాని శ్రీ కిరియకోస్ మిట్సుటాకీస్ ఫోన్ చేశారు.
భారత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని గ్రీస్ ప్రధాని శ్రీ మిట్సుటాకీస్ అభినందించారు.
ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి చర్చల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పుంజుకోవడంపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత- గ్రీసు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాంటించారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పీఎం శ్రీ మిట్సుటాకీస్ భారత పర్యటన అనంతరకాలంలో- వాణిజ్యం, రక్షణరంగం, నౌకాయానం, తత్సంబంధిత అనుసంధాన వ్యవస్థల పరంగా చోటు చేసుకున్న పురోగతిని ఇద్దరు నేతలూ సమీక్షించారు.
పశ్చిమాసియాలోని తాజా పరిణామాలు, భారత్- మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్ధిక మండలి (ఐఎంఈఈసీ) తోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
తరచూ మాట్లాడుకునేందుకు ఉభయులూ అంగీకరించారు.
***
MJPS
(Release ID: 2070267)
Visitor Counter : 65
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam