ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని కచ్‌లో సాయుధ దళాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీపావళి వేడుక


నిర్జన ప్రదేశాల్లో దుర్భేద్య దుర్గంలా మనను రక్షించే సరిహద్దు భద్రత సిబ్బంది మనకెంతో గర్వకారణం

प्रविष्टि तिथि: 31 OCT 2024 7:20PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని కచ్‌ జలసంధి ప్రాంతంలో లక్కీ నాలా వద్ద బిఎస్ఎఫ్ఆర్మీనేవీవైమానిక దళాలకు చెందిన వీర జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారునిర్జన ప్రదేశాల్లో దుర్భేద్య దుర్గంలా మనందర్నీ రక్షించే మన భద్రత సిబ్బంది మనకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారువిపరీత ఉష్ణోగ్రతల వల్ల మారుమూలనున్న కచ్‌ జలసంధి ప్రాంతం సవాళ్లతో కూడినదేగాక పర్యావరణపరమైన ఇతరత్రా సమస్యలు కూడా మనను పీడిస్తాయని ప్రధాని వివరించారు.

జలసంధి ప్రాంతంలోని జలాల్లో తేలియాడే సరిహద్దు గస్తీ శిబిరాల్లో ఒకదాన్ని ఆయన సందర్శించివీర సైనిక సిబ్బందితో స్వీట్లు పంచుకున్నారు.

ఈ పర్యటనపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

 

 

   ‘‘గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో మన వీర సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నానుఇలాంటి నిర్జన ప్రదేశాల్లో మన సరిహద్దు భద్రతా సిబ్బంది కోటగోడలా దృఢంగా నిలిచి మనందర్నీ కాపాడుతున్నారుఅంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించే ఈ జవాన్లు మనకెంతో గర్వకారణం.

 

 

 

 

కచ్‌ జలసంధి ప్రాంతంలో లక్కీ నాలా వద్ద బిఎస్ఎఫ్ఆర్మీనేవీవైమానిక దళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొనడం నాకు ఎనలేని ఆనందాన్నిచ్చిందివిపరీత ఉష్ణోగ్రతల వల్ల మారుమూలనున్న కచ్‌ జలసంధి ప్రాంతం సవాళ్లతో కూడినదేగాక పర్యావరణపరమైన ఇతరత్రా సమస్యలు కూడా పీడిస్తాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా జలసంధి ప్రాంతంలోని జలాల్లో తేలియాడే సరిహద్దు గస్తీ శిబిరాల్లో ఒకదాన్ని సందర్శించివీర సైనిక సిబ్బందితో స్వీట్లు పంచుకున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

 

MJPS/VJ


(रिलीज़ आईडी: 2069921) आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam