ప్రధాన మంత్రి కార్యాలయం
పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్దుని బోధనలు విశ్వసించే వారిలో ఆనందాన్ని నింపింది: ప్రధాన మంత్రి
Posted On:
24 OCT 2024 10:43AM by PIB Hyderabad
పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు నింపుతుందని అన్నారు. కొలంబోలో ఐసీసీఆర్ నిర్వహించిన ‘ప్రాచీన భాషగా పాళీ’ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పండితులు, బౌద్ధ భిక్షువులకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఇండియా ఇన్ శ్రీలంక’ సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘పాళీకి ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను పాటించే వారిలో ఆనందోత్సాహాలను నింపింనందుకు సంతోషిస్తున్నాను. కొలంబోలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన పండితులు, భిక్షువులకు కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేశారు.
***
MJPS/VJ/SR
(Release ID: 2067614)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam