ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లావోస్ దేశాధ్యక్షుడితో ప్రధాని భేటీ

Posted On: 11 OCT 2024 1:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లావోస్ అధ్యక్షుడులావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ (ఎల్‌పీఆర్‌పీకేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి థాంగ్లౌన్ సిసౌలిత్‌తో వియాంటియాన్‌లో సమావేశమయ్యారుఆసియాన్ సదస్సునుతూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన ఇరువురు నేతలు.. సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారుభారత్‌-లావోస్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యం పురాతన నాగరిక సంబంధాల్లో చాలా పటిష్ఠంగా ఉందని ఇద్దరు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారుఅభివృద్ధి విషయంలో భాగస్వామ్యంవారసత్వ సంపద పునరుద్ధరణసాంస్కృతిక మార్పిడి వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారుభారత యాక్ట్ ఈస్ట్ పాలసీకి 2024తో దశాబ్దం నిండుతుందని తెలిపిన ప్రధాన మంత్రి... లావోస్‌తో భారత్ ‌సంబంధాలను మరింత వేగంగా మెరుగుపరచటంలో దాని ప్రాముఖ్యతను ప్రస్తావించారురెండు దేశాల మధ్య నాగరిక సంబంధాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ.. పునఃప్రారంభం చేసిన నలంద విశ్వవిద్యాలయం అందించే అవకాశాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారుయాగీ తుఫాను వరదలకు సంబంధించి లావోస్‌కు భారత్‌ అందించిన మానవతా సహాయం పట్ల ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు సిసౌలిత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌-ఆసియాన్ సంబంధాల బలోపేతం విషయంలో లావోస్ అందించిన సహాయసహకారాలకు ఆ దేశ అధ్యక్షుడు సిసౌలిత్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుపరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

 

****

 


(Release ID: 2064187) Visitor Counter : 27