ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారాలింపిక్స్ క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని

प्रविष्टि तिथि: 04 SEP 2024 4:33PM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అథ్లెట్ల అంకితభావం, పట్టుదలను శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రతి క్రీడాకారుడికి వారు సాధించిన అద్భుతమైన విజయాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా స్పందించారు:  

‘‘భారతదేశం గర్విస్తోంది. సంబరపడుతోంది!

తొలిసారిగా ఈ పారాలింపిక్స్ లో మన దేశానికి అత్యధిక పతకాలు సాధించి, మన పారాలింపిక్ బృందం రికార్డు సృష్టించింది. ఇది మన క్రీడాకారుల అంకితభావం, పట్టుదల, సంకల్పాన్ని తెలియజేస్తుంది. ప్రతి క్రీడాకారుడికీ అభినందనలు. #Cheer4Bharat’’ అని పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2051890) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam