పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
52 కోట్లు దాటిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ చెట్లు
ప్రపంచ పర్యావరణ దినాన ప్రచారం ప్రారంభించిన ప్రధాని
Posted On:
03 SEP 2024 9:50AM by PIB Hyderabad
‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంలో దేశం కొత్త మైలు రాయిని చేరుకుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తెలిపారు. ఈ ప్రచారం ద్వారా దేశ వ్యాప్తంగా 52 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో మంత్రి ఈరోజు పోస్ట్ చేశారు.
ప్రపంచ పర్యావరణ దినమైన జూన్ 5 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ‘ఏక్ పేడ్ మాకే నామ్’ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మెరుగైన భూవాతావరణం, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
(Release ID: 2051363)
Visitor Counter : 167
Read this release in:
Urdu
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Kannada
,
Khasi
,
English
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam