ప్రధాన మంత్రి కార్యాలయం

‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమం మహిళలకు విద్యా, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారితలు దక్కేటట్లు చేసింది: ప్రధాన మంత్రి

Posted On: 29 AUG 2024 3:13PM by PIB Hyderabad

స్వయంసహాయ బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో వారి వంతు భాగస్వామ్యం ఉండేటట్లు ‘లఖ్‌పతి దీదీస్’ (లక్షాధికార సోదరీమణులు) శ్రద్ధ వహిస్తున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని,  గత పదేళ్లలో అంతకు ముందు ఎన్నడూ లేనంత స్థాయి కృషి జరుగుతూ వచ్చింది, ఫలితంగా దేశంలో మహిళలు ముందడుగు వేసి సమృద్ధిని సాధించడమే కాకుండా పురోగతి పథంలో కొత్త మైలురాళ్లను స్థాపించడం కూడా సాధ్యపడుతోందని ప్రధాని అన్నారు.

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ‘ఎక్స్’ లో పొందుపరిచిన ఒక సందేశంపై ప్రధాన మంత్రి కార్యాలయం వ్యాఖ్యానిస్తూ, ఈ కింది విధంగా పేర్కొంది :

“केंद्रीय मंत्री श्री @ChouhanShivraj जी लिखते हैं कि लखपति दीदियां स्व-सहायता समूह के माध्यम से राष्ट्र निर्माण में अपनी भागीदारी सुनिश्चित कर रही हैं। देश में महिलाएं आगे बढ़ें, समृद्ध और संपन्न बनें व प्रगति के नए आयाम स्थापित करें, इसके लिए विगत 10 वर्षों से महिला कल्याण के अभूतपूर्व कार्य किए जा रहे हैं। महिलाओं के शैक्षणिक, सामाजिक, आर्थिक और राजनीतिक सशक्तिकरण को सुनिश्चित किया गया है।”

 

 

***

MJPS/TS



(Release ID: 2049770) Visitor Counter : 30