ప్రధాన మంత్రి కార్యాలయం
లద్దాక్ లో అయిదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు
మెరుగైన పాలన, సంక్షేమం దిశగా వేసిన ముందడుగే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 AUG 2024 12:54PM by PIB Hyderabad
లద్ధాక్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ తంగ్ జిల్లాల్లో ప్రజలకు సేవలు, అవకాశాలు మరింత చేరువ అవుతాయని ఆకాంక్షించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ ను షేర్ చేస్తూ ప్రధానమంత్రి -
‘‘లద్ధాక్ లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం మెరుగైన పాలన, సంక్షేమం దిశగా వేసిన ముందడుగు. జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ తంగ్ జిల్లాల్లో ప్రజలకు సేవలు, అవకాశాలు మరింత చేరువ అవుతాయి. అక్కడి ప్రజలకు నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
***
MJPS/TS
(रिलीज़ आईडी: 2048897)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam