ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖల మంత్రుల సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2024 9:53PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కామికావా యొకొ, జపాన్ రక్షణ శాఖ మంత్రి శ్రీ కిహారా మైనొరు లు సోమవారం సమావేశమయ్యారు. శ్రీ నరేంద్ర మోదీ వారిద్దరికీ స్వాగతం పలికారు. త్వరలో భారత్, జపాన్ ల విదేశీ వ్యవహారాల శాఖకు, రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 2+2 సమావేశం జరగనుంది. ఈ తరహా సమావేశాలు ఇంతకు ముందు రెండు సార్లు జరిగాయి. ప్రస్తుతం జరగబోయే సమావేశం మూడోది. భారత్-జపాన్ రక్షణ సంబంధాలతో పాటు భద్రత సంబంధాలలో చోటుచేసుకొన్న ప్రగతిని ఈ సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి సమీక్షించారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

“‘భారత్, జపాన్ ల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 2+2 సమావేశం త్వరలో జరగనుండగా జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కామికావా యొకొ (@Kamikawa_Yoko) తోను, రక్షణ శాఖ మంత్రి శ్రీ కిహారా మైనొరు (@kihara_minoru) తోను సమావేశం జరిగినందుకు సంతోషిస్తున్నాను. భారత్-జపాన్ రక్షణ, భద్రత సంబంధాలలో చోటుచేసుకొన్న ప్రగతిని సమీక్షించాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి ఆవల శాంతిని, స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని పెంపొందింప చేయడంలో భారత్, జపాన్ ల భాగస్వామ్యం తన వంతు పాత్రను పోషిస్తుందని పునరుద్ఘాటించాను.”

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2047613) సందర్శకుల సూచీ సంఖ్య : : 64