ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మోంటె కేసినో యుద్ధ స్మారక కట్టడం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 21 AUG 2024 11:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వార్సా లో బుధవారం మోంటె కేసినో యుద్ధ స్మారకానికి చేరుకొని, ఒక పూల హారాన్ని అక్కడ ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఈ స్మారకం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రఖ్యాత మోంటె కేసినో పోరాటంలో భుజం భుజం కలిపి పోరాటం చేసిన పోలెండ్, భారతదేశం, తదితర దేశాల సైనికుల త్యాగాలను, పరాక్రమాన్ని స్మరించుకొనేందుకు రూపొందించింది.  ప్రధాన మంత్రి ఈ స్మారకాన్ని సందర్శించడం భారతదేశానికి, పోలెండ్ కు మధ్య గల ఉమ్మడి చరిత్ర, గాఢతమ సంబంధాల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కట్టడం ఎందరికో ఈనాటికీ ప్రేరణనిస్తోంది.


(Release ID: 2047525) Visitor Counter : 66