ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఆర్ జూ రాణా దేవ్ బా సమావేశం

प्रविष्टि तिथि: 19 AUG 2024 9:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఆర్ జూ రాణా దేవ్ బా సోమవారం (2024 ఆగస్టు 19న) సమావేశమయ్యారు. డాక్టర్ ఆర్ జూ రాణా దేవ్ బా కు స్వాగతిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ.. ‘‘భారతదేశం, నేపాల్ అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యం ఇక ముందు కూడా వేగంగా ముందుకు సాగాలని తాను భావిస్తున్నాను’’ అని  చెప్పారు.  

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో:

‘‘నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఆర్ జూ రాణా దేవ్ బా  (@Arzuranadeuba) గారికి స్వాగతం పలుకుతున్నందుకు సంతోషిస్తున్నాను. భారత్, నేపాల్ దేశాల నాగరకతల మధ్య చాలా దగ్గరి సంబంధాలతో పాటు ప్రగతిశీలమైన, బహుముఖీనమైన భాగస్వామ్యం కూడా ఉంది. మన రెండు దేశాల అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యం ఇక ముందు సైతం నిరంతర గతిన మునుముందుకు సాగిపోతూ ఉంటుందని ఆశపడుతున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2047252) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam