సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘అంతర్రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ 2024’ నమోదు గడువును 2024 జులై 15 వరకు పొడిగించిన మంత్రిత్వ శాఖ
Posted On:
10 JUL 2024 10:52AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 సమాచారాన్ని ప్రజలకు ప్రభావవంతంగా చేరవేయడంలో మీడియా పోషిస్తున్న బాధ్యతాయుతమైన సకారాత్మక పాత్రను గుర్తిస్తూ నెలకొల్పిన ‘అంతర్రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ 2024’(AYDMS) మూడవ సంచిక పురస్కారాల కోసం పేర్ల నమోదు గడువును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2024 జులై 15 (సోమవారం) వరుకూ పొడిగించింది.
‘అంతర్రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ 2024’ (AYDMS), మూడవ సంచికకు సంబంధించి మీడియా సంస్థలు తమ ఎంట్రీలను, యోగాకు సంబంధించిన రచనలను aydms2024.mib[at]gmail[dot]com అనే మెయిల్ ఐడీకి జులై 15, 2024 లోగా పంపించాలి. ఇందుకు సంబంధించిన సవివరమైన నియమ నిబంధనలను సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్ (https://mib.gov.in/) లో కానీ, పత్రికా సమాచార కార్యాలయం వెబ్సైట్ (https://pib.gov.in) లో కానీ పొందవచ్చు.
***
(Release ID: 2032265)
Visitor Counter : 69
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam