ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్ 20వ తేదీమరియు జూన్ 21వ తేదీ లలో జమ్ము లో, కశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి


పదిహేను వందల కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన 84అభివృద్ది ప్రాజెక్టుల కు జమ్ము లోను, కశ్మీర్ లోను శంకుస్థాపన మరియుప్రారంభోత్సవం చేయనున్న ప్రధాన మంత్రి

పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువ కలిగిన కాంపిటీటివ్నెస్ ఇంప్రూవ్ మెంట్ ఇన్ ఎగ్రీకల్చర్ ఎండ్ అలైడ్ సెక్టర్స్ (జెకెసిఐపి) ప్రాజెక్టును ప్రారంభించనున్న  ప్రధాన మంత్రి

శ్రీనగర్ లో యోగ యొక్క పదో అంతర్జాతీయ దినం వేడుకలకునాయకత్వం వహించనున్న  ప్రధాన మంత్రి

యోగ యొక్క పదో అంతర్జాతీయ దినానికి ఇతివృత్తం గా ‘‘వ్యక్తికోసం మరియు సమాజం కోసం యోగ’’ ఉంది 

Posted On: 19 JUN 2024 4:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూన్ 20వ తేదీ మరియు 21వ తేదీ లలో జమ్ము ను, ఇంకా కశ్మీర్ ను సందర్శించనున్నారు.

 

 

జూన్ 20వ తేదీ నాడు సాయంత్రం సుమారు 6 గంటల వేళ లో శ్రీనగర్ లోని శేర్--కశ్మీర్ ఇంటర్ నేశనల్ కాన్ఫరన్స్ సెంటర్ (ఎస్ కెఐసిసి)లో ‘ఎంపవరింగ్ యూథ్, ట్రాన్స్ ఫార్మింగ్ జె&కె’ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. జమ్ము లోను, కశ్మీర్ లోను అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. కాంపిటీటివ్ నెస్ ఇంప్రూవ్ మెంట్ ఇన్ ఎగ్రీకల్చర్ ఎండ్ అలైడ్ సెక్టర్స్ (జెకెసిఐపి) ప్రాజెక్టు ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

 

 

జూన్ 21వ తేదీ నాడు ఉదయం దాదాపు గా ఆరున్నర గంటల వేళ లో శ్రీనగర్ లోని ఎస్ కెఐసిసి లో యోగ యొక్క పదో అంతర్జాతీయ దినం సంబంధి కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భం లో జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు. ఆ తరువాత, సివైపి యోగ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు.

 

జమ్ము లో, కశ్మీర్ లో యువత సశక్తీకరణ - పరివర్తన

‘‘ఎంపవరింగ్ యూథ్, ట్రాన్స్ ఫార్మింగ్ జె ఎండ్ కె’’ కార్యక్రమం ఈ ప్రాంతానికి ఒక మైలు రాయి వంటిది. ఈ కార్యక్రమం ప్రగతి ని కళ్లకు కడుతూ మరి యువ కార్యసాధకుల కు ప్రేరణ ను అందించనుంది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి స్టాళ్ల ను తనిఖీ చేయడం తో పాటు గా జమ్ము మరియు కశ్మీర్ లలో యువ కార్యసాధకుల తో భేటీ కానున్నారు.

 

పదిహేను వందల కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన 84 అభివృద్ది ప్రాజెక్టుల కు జమ్ము లోను, కశ్మీర్ లోను ప్రధాన మంత్రి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమాల లో రహదారి సంబంధి మౌలిక సదుపాయాల కల్పన, నీటి సరఫరా పథకాలు మరియు ఉన్నత విద్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన వంటివి భాగం కానున్నాయి. వీటికి అదనం గా, చెన్నై-పట్ నీటాప్-నాశ్ రి సెక్శను ను మెరుగుపరచడం, పారిశ్రమిక వాడలను అభివృద్ధిపరచడం తో పాటు ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లను నిర్మించడం వంటి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

 

ప్రధాన మంత్రి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువ కలిగిన కాంపిటీటివ్ నెస్ ఇంప్రూవ్ మెంట్ ఇన్ ఎగ్రీకల్చర్ ఎండ్ అలైడ్ సెక్టర్స్ (జెకెసిఐపి) ప్రాజెక్టు ను కూడ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ను జమ్ము లో మరియు కశ్మీర్ లో 20 జిల్లాల లోని తొంభై బ్లాకుల లో అమలుపరచడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 30,000 కుటుంబాల కు చెందిన మొత్తం 15 లక్షల మంది లబ్ధిదారుల కు ప్రయోజనం చేకూరుతుంది.

 

ప్రభుత్వ ఉద్యోగాల లో నియామకం జరిగిన 2000 మంది కి పైగా వ్యక్తుల కు నియామకం పత్రాల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేయనున్నారు.

 

ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన/ప్రారంభోత్సవం తో పాటు ఈ పథకాల ను ప్రవేశపెట్టడం వల్ల జమ్ము లోని మరియు కశ్మీర్ లోని యువత కు సాధికారిత లభిస్తుంది, ఈ ప్రాంతాల లో మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ చోటు చేసుకోనంది.

 

యోగ యొక్క అంతర్జాతీయ దినం

 

యోగ తాలూకు పదో అంతర్జాతీయ దినం 2024 జూన్ 21 వ తేదీ న రానుండగా, ఆ సందర్భం లో శ్రీనగర్ లోని ఎస్ కెఐసిసి లో నిర్వహించే వేడుకల కు ప్రధాన మంత్రి నాయకత్వం వహించనున్నారు. ఈ సంవత్సరం లో చేపట్టే కార్యక్రమం యువత మేధస్సు పైన మరియు దేహం పైన యోగ యొక్క ఎనలేని ప్రభావాన్ని చాటిచెప్పనుంది. ఈ కార్యక్రమం వేల కొద్దీ వ్యక్తుల ను యోగ సాధన కై ఏకం చేయడం తో పాటు ప్రపంచ స్థాయి లో ఆరోగ్యాన్ని మరియు శ్రేయాన్ని ప్రోత్సహించనుంది.

 

ప్రధాన మంత్రి 2015 వ సంవత్సరం మొదలుకొని దిల్లీ లోని కర్తవ్య పథ్ లో, చండీగఢ్, దెహ్ రాదూన్, రాంచీ, లఖ్ నవూ, మైసూరు ల వంటి అనేక ప్రముఖ ప్రాంతాల లోను, న్యూ యార్క్ లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లోను జరిగిన యోగ యొక్క అంతర్జాతీయ దినం (ఐడివై) వేడుకల కు నేతృత్వాన్ని వహించారు.

 

ఈ సంవత్సరానికి నిర్దేశించుకొన్నటువంటి ‘‘యోగ ఫార్ సెల్ఫ్ ఎండ్ సొసైటీ’’ వ్యక్తి యొక్క మరియు సమాజం యొక్క శ్రేయాన్ని పెంపొందించడం అనే ద్విపాత్ర లను ప్రముఖం గా చాటిచెప్పనుంది. ఈ కార్యక్రమం కూకటివేళ్ల స్థాయి లో ప్రాతినిధ్యాన్ని మరియు గ్రామీణ ప్రాంతాల లో యోగ యొక్క వ్యాప్తి ని ప్రోత్సహించనుంది.

 

 

***

 



(Release ID: 2026662) Visitor Counter : 33