ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘‘రేమల్’’తుపాను యొక్క ప్రభావాన్ని సమీక్షించిన ప్రధాన మంత్రి


బాధిత రాష్ట్రాల పైన తుపాను చూపిన ప్రభావాన్ని గురించిప్రధాన మంత్రి కి వివరించడమైంది

బాధిత రాష్ట్రాల కు ప్రభుత్వం పూర్తి సమర్థన నుఅందించడాన్ని కొనసాగిస్తుందన్న ప్రధాన మంత్రి

అవసరాల మేరకు ఎన్ డిఆర్ఎఫ్ జట్టుల ను రంగం లోకి దింపడమైంది;ఈ జట్టు లు బాధితుల ను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు చేర్చడం, వాయు మార్గం ద్వారా తరలింపులను చేపట్టడం తో పాటు రహదారుల పైన ఏర్పడ్డఅవరోధాల ను తొలగించి రహదారుల ను తిరిగి రాకపోకల కు అనువు గా చేయడం వంటికార్యకలాపాల ను నిర్వహించాయి

స్థితి ని పర్యవేక్షిస్తూ ఉండాలని, పునరుద్ధరణ కార్యాలకుఅవసరమైన సహాయాన్ని అందించడం కోసం విషయాలను క్రమం తప్పక సమీక్షించాలంటూ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ను కూడ ఆదేశించిన ప్రధాన మంత్రి

Posted On: 02 JUN 2024 2:34PM by PIB Hyderabad

‘‘రేమల్’’ తుపాను యొక్క ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి న్యూ ఢిల్లీ లో 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో గల తన నివాసం లో ఈ రోజు నసమీక్ష ను నిర్వహించారు.

 

 

తుపాను ప్రభావం కనిపించిన రాష్ట్రాల ను గురించి అధికారులు ఈ సమావేశం లో ప్రధాన మంత్రి కి వివరించారు. మరియు మిజోరమ్, అసమ్, మణిపుర్, మేఘాలయ మరియు త్రిపురల లో కొండచరియలు విరిగిపడడం మరియు వరద ల కారణంగా వాటిల్లిన ప్రాణ నష్టాన్ని గురించి, ఇంకా ఇళ్ల కు, సంపత్తి కి సంభవించిన నష్టాన్ని గురించి కూడ ఈ సమావేశం లో చర్చించడమైంది. అవసరపడిన మేరకు ఎన్ డిఆర్ఎఫ్ జట్టుల ను రంగం లోకి దింపడమైంది. బాధితుల ను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాల కు చేర్చడం, వాయు మార్గం ద్వారా తరలింపులను చేపట్టడం తో పాటు రహదారుల పైన ఏర్పడ్డ అవరోధాల ను తొలగించి రహదారుల ను తిరిగి రాకపోకల కు అనువు గా చేయడం వంటి కార్యకలాపాల ను నిర్వహించడమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తో దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపులను జరుపుతూ ఉందని ఈ సమావేశం లో ప్రస్తావించడమైంది.

 

 

తుపాను బాధిత రాష్ట్రాలకు భారత ప్రభుత్వం పూర్తి సమర్థన ను అందజేయడాన్ని కొనసాగిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. స్థితి ని పర్యవేక్షిస్తూ ఉండాలని, పునరుద్ధరణ కార్యాలకు అవసరమైన సహాయాన్ని అందించడం కోసం విషయాలను క్రమం తప్పక సమీక్షించాలంటూ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు ప్రధాన మంత్రి ఆదేశాలను కూడ ఇచ్చారు.

 

 

ఈ సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎన్ డిఆర్ఎఫ్ డిజి, ఎన్ డిఎమ్ఎ మెంబర్ సెక్రట్రి, పిఎంఒ లోని మరియు సంబంధి మంత్రిత్వ శాఖల లోని సీనియర్ అధికారులు పాలుపంచుకొన్నారు.

 

 

**

 


(Release ID: 2022572) Visitor Counter : 141