సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మే 14 నుండి 25 వరకూ జరగనున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్న భారతదేశం


77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భారత్‌ పర్వ’ వేడుక

ఈ సంవత్సరం క్రియేట్ ఇన్ ఇండియా థీమ్‌ను వివరించడానికి 'ది సూత్రధార' ప్రేరణతో భారత్ పెవిలియన్‌ను రూపొందించిన అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐడి

30 ఏళ్ల తర్వాత పోటీ పడుతున్న భారతీయ చిత్రం పాయల్ కపాడియా రూపొందించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’

నవంబర్‌ 2024లో జరగనున్న 55వ ఐఎఫ్‌ఎఫ్ఐ పోస్టర్ & ట్రైలర్ లాంచ్ వేడుకతో పాటు మొదటి వేవ్స్‌ సేవ్‌ది డేట్‌ కార్యక్రమం

Posted On: 10 MAY 2024 1:08PM by PIB Hyderabad

త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 77వ ఎడిషన్‌ భారతదేశానికి ప్రత్యేక సందర్భంగా మారనుంది. కార్పోరేట్ ఇండియన్ డెలిగేషన్‌ ఆధ్వర్వంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ సభ్యులు భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని ప్రముఖ చలనచిత్ర మార్కెట్‌లో మార్చే డు ఫిల్మ్స్‌లో అనేక ముఖ్యమైన కార్యక్రమాల ద్వారా ప్రదర్శిస్తారు.

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేశ ప్రముఖులు, సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నిర్మాతలు, ఫెస్టివల్‌లో పాల్గొనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మరియు ప్రతినిధుల కోసం “భారత్ పర్వ్”ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు మరియు సేల్స్ ఏజెంట్లు మరియు అనేక సృజనాత్మక అవకాశాలను మరియు సృజనాత్మక ప్రతిభతో కూడిన గొప్ప బ్యాంకును ప్రదర్శిస్తారు. 2024 నవంబర్ 20-28 తేదీల్లో గోవాలో జరగనున్న 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్‌ఐ) అధికారిక పోస్టర్ & ట్రైలర్‌ను ఈ భారత్ పర్వ్‌లో ఆవిష్కరించనున్నారు. 55వ ఐఎఫ్‌ఎఫ్‌ఐతో పాటుగా నిర్వహించబడే మొదటి ప్రపంచ ఆడియో-విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) కోసం “సేవ్ ది డేట్” విడుదలను కూడా భారత్ పర్వ్‌లో నిర్వహించనున్నారు.

108 విలేజ్ ఇంటర్నేషనల్ రివేరాలో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్ పెవిలియన్ మే 15న ప్రముఖ సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానుంది. కేన్స్‌లోని భారత్ పెవిలియన్ భారతీయ చలనచిత్ర కమ్యూనిటీకి వివిధ కార్యకలాపాలలో నిమగ్నమవ్వడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. వీటిలో నిర్మాణ సహకారాన్ని పెంపొందించడం, క్యూరేటెడ్ నాలెడ్జ్ సెషన్‌లు, పంపిణీ ఒప్పందాలపై సంతకం చేయడం, గ్రీన్‌లైట్ స్క్రిప్ట్‌లు, బి2బి సమావేశాలు మరియు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మీడియా ప్లేయర్‌లతో నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పెవిలియన్‌ను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కి)తో కలిసి పరిశ్రమ భాగస్వామిగా నిర్వహిస్తుంది. పరిశ్రమను కనెక్ట్ చేయడంతో పాటు సహకరించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో మార్చే డు కేన్స్‌లో ‘భారత్ స్టాల్’ ఉండనుంది.

అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ ఈ భారత్ పెవిలియన్‌ను రూపొందించింది. ఈ సంవత్సరం "క్రియేట్‌ ఇన్‌ ఇండియా" అనే థీమ్‌ను వర్ణించాడినికి 'ది సూత్రధార' అని పేరు పెట్టారు. ఇందులో భారతదేశ ఉనికిని పరిశీలిస్తే ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గొప్ప చరిత్ర మరియు సృజనాత్మకతను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరిస్తాయి.

ఇక స్పాట్‌లైట్‌లో ప్రేక్షకులను ఆకర్షించడానికి మరియు ప్రతిష్టాత్మకమైన పామ్ డి'ఓర్ కోసం పోటీ పడడానికి పాయల్ కపాడియా యొక్క మాగ్నమ్ ఓపస్ "ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్" సిద్ధంగా ఉంది. మూడు దశాబ్దాల తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఎంపిక పోటీ విభాగంలో భారతీయ టైటిల్ పొందడం వలన ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంది. దర్శకుల ఫోర్ట్‌నైట్‌లో కరణ్ కంధారి రూపొందించిన ఉద్వేగభరితమైన "సిస్టర్ మిడ్‌నైట్" మరియు ఎల్‌సిడ్‌ట్రీట్‌లో మైసం అలీ  "ఇన్ రీట్రీట్‌" ఉన్నాయి.

ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) విద్యార్థి చిత్రం “సన్‌ఫ్లవర్స్ వేర్ ఫస్ట్ ఒన్స్ టు నో” లా సినీఫ్ కాంపిటీటివ్ విభాగంలో ఎంపికైంది. కన్నడలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్, ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీలలో షార్ట్‌లిస్ట్ చేయబడింది మరియు ఇప్పుడు చివరి దశలో మరో 17 అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్‌లతో పోటీపడనుంది.

ఇంకా శ్యామ్‌బెనెగల్ యొక్క ‘మంథన్’, అమూల్ డెయిరీ కోఆపరేటివ్ ఉద్యమంపై దృష్టి సారించే చలనచిత్రం, పండుగ భారతీయ లైనప్‌కు చారిత్రక ప్రాముఖ్యతను జోడిస్తూ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించబడుతుంది. ఫిల్మ్ రీల్స్ మంత్రిత్వ శాఖ యొక్క యూనిట్ అయిన ఎన్‌ఎఫ్‌డిసి-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఏఐ) యొక్క ఫిల్మ్ వాల్ట్‌లలో అనేక దశాబ్దాలుగా భద్రపరచబడ్డాయి మరియు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (ఎఫ్‌హెచ్‌ఎం) ద్వారా పునరుద్ధరించబడింది.

జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన పియరీ ఏంజెనియక్స్ ట్రిబ్యూట్‌ను అందుకోనున్నారు. అతను కేన్స్ డెలిగేట్‌లకు మాస్టర్‌క్లాస్‌ను కూడా అందజేస్తారు. తద్వారా ఈ ఘనతను అందుకున్న మొదటి భారతీయుడుగా నిలవనున్నారు.

గోవా, మహారాష్ట్ర, జమ్మూ & కాశ్మీర్, కర్నాటక, జార్ఖండ్ మరియు ఢిల్లీతో సహా అనేక భారతీయ రాష్ట్రాలు భారతదేశం యొక్క విభిన్న ప్రదేశాలు మరియు చలనచిత్ర ప్రతిభను ప్రదర్శించడంలో సహాయపడతాయి.

భారతదేశ సహకారంతో చలనచిత్ర నిర్మాణ అవకాశాలను అన్వేషించే సెషన్, “అబండెంట్ ఇన్సెంటివ్‌ అండ్ సీమ్‌లెస్‌ ఫెసిలిటిస్‌- కమ్, క్రియేట్ ఇన్ ఇండియా” పేరుతో మే 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన వేదిక (రివేరా)లో నిర్వహించబడుతోంది. చలనచిత్ర నిర్మాణం, సహ నిర్మాణ అవకాశాలు మరియు అగ్రశ్రేణి పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాల కోసం భారతదేశం అందిస్తున్న భారీ ప్రోత్సాహకాలను ప్యానెల్ చర్చ తెలియజేస్తుంది. అలాగే చిత్రనిర్మాతలు ఈ కార్యక్రమాలను ఎలా స్వాగతిస్తున్నారు, భారతదేశంలో చిత్రీకరణకు సంబంధించి వాస్తవ అనుభవాలు మరియు భాగస్వామ్యం చేయబడుతున్న ఉత్తేజకరమైన కథనాలు ఏమిటి అనే విషయాలను ప్యానెల్ ముందుకు తెస్తుంది.

చిత్రోత్సవంలో నిర్వహించబడే భారత్ పెవిలియన్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌లు భారతదేశంలో రూపొందించడానికి ప్రోత్సాహకాలు, ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అంతర్జాతీయ సహకారం, చిత్రీకరణ గమ్యస్థానంగా భారతదేశం, భారతదేశం మరియు స్పెయిన్, యుకె మరియు ఫ్రాన్స్ వంటి దేశాల మధ్య ద్వైపాక్షిక చలనచిత్ర సహ-నిర్మాణాలు వంటి అంశాలను కవర్ చేస్తాయి.  భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో నిమగ్నమవ్వాలని కోరుకునే చిత్రనిర్మాతలకు చర్చలు, నెట్‌వర్కింగ్ మరియు సహకార అవకాశాలను సులభతరం చేయడం ఈ సెషన్‌ల లక్ష్యం.

 

***



(Release ID: 2020312) Visitor Counter : 86