ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భూటాన్‌ అధికార పర్యటన: ఫలితాల జాబితా

Posted On: 22 MAR 2024 3:10PM by PIB Hyderabad

అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలు/కార్యాచరణ ప్రణాళిక

వ.సం.

అవగాహన ఒప్పందం/ ఒడంబడిక/కార్యాచరణ ప్రణాళిక

వివరణ

సంతకాలు చేసిన ప్రతినిధులు

భూటాన్

భారత్

1

భారత్ నుంచి భూటాన్‌కు పెట్రోలు/ చమురు/ కందెనలు (పిఒఎల్) వంటి ఉత్పత్తుల సాధారణ సరఫరాపై అవగాహన ఒప్పందం

పెట్రోలు/చమురు/కందెనల సంబంధ వస్తు జాబితాను ఈ ఒప్పందం సూచిస్తుంది. అంగీకృత ప్రవేశ/ నిష్క్రమణ ప్రాంతాల ద్వారా భారత ప్రభుత్వం వీటిని భూటాన్‌కు సరఫరా చేయడంలో తోడ్పడుతుంది.

శ్రీమతి తాషి వాంగ్మో, కార్యదర్శి, పరిశ్రమలు-వాణిజ్యం- ఉపాధి మంత్రిత్వశాఖ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

2

భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ద్వారా భూటాన్ ఆహార-ఔషధ ప్రాధికార సంస్థ (బిఎఫ్‌డిఎ)అధికారిక నియంత్రణ గుర్తింపుపై ఒడంబడక

ఇది భార‌త్‌-భూటాన్‌ల‌ మధ్య వాణిజ్య సౌలభ్య కల్పన ద్వారా వ్యాపార లావాదేవీలను సుగమం చేయడమేగాక ఉభయ పక్షాలకూ అమలు వ్యయం తగ్గింపులో తోడ్పడుతుంది. భార‌త్‌కు తమ ఉత్పత్తుల ఎగుమతిపై ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ’ నిర్దేశించిన నిబంధనల మేరకు ‘బిఎఫ్‌డిఎ’ జారీచేసే తనిఖీ ధ్రువీకరణ పత్రాన్ని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ’ ఆమోదిస్తుంది.

శ్రీ పెంబా వాంగ్‌చుక్, కార్యదర్శి, ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

3

ఇంధన పొదుపు/ఇంధన సంరక్షణ చర్యల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం

ఇంధన పొదుపు సంస్థ (బిఇఇ) రూపొందించిన స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్‌ను భూటాన్ ప్రోత్సహిస్తుంది. తద్వారా గృహోపకరణాల రంగంలో ఇంధన సామర్థ్యం పెంచేలా భూటాన్‌కు చేయూతనివ్వడం ఈ ఒప్పంద లక్ష్యం. అలాగే భారత్ అనుభవం ప్రాతిపదికన బిల్డింగ్ కోడ్‌ల రూపకల్పన, ఇంధన తనిఖీ నిపుణుల శిక్షణ సంస్థాగతీకరణ ద్వారా భూటాన్‌లో నిపుణుల తయారీ తదితరాలు కూడా దీనికిందకు వస్తాయి.

శ్రీ కర్మ షెరింగ్, కార్యదర్శి, ఆర్థిక-సహజ వనరుల మంత్రిత్వశాఖ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

4

క్రీడా-యువజన వ్యవహారాల్లో సహకారంపై అవగాహన ఒప్పందం

భారత్-భూటాన్‌ ప్రజల మధ్య అనుసంధానం పెంపుద్వారా రెండు పక్షాల క్రీడా సంస్థల నడుమ సంబంధాల విస్తృతికి ఇది తోడ్పడుతుంది. అలాగే క్రీడలు/కార్యక్రమాల నిర్వహణ ద్వారా మరింత మందికి చేయూతనిస్తుంది.

శ్రీమతి పెమా చోడెన్, కార్యదర్శి, విదేశాంగ-విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

5

ప్రమాణాల పరిశీలన, ఫార్మకోపియా, ఔషధ ఉత్పత్తుల పరీక్ష-నిఘా సంబంధిత అంశాల ఆదానప్రదాన సహకారంపై అవగాహన ఒప్పందం

ఔషధ నియంత్రణ రంగంలో రెండు వైపులా నిర్దిష్ట చట్ట/నిబంధనల మేరకు సన్నిహిత సహకారం, సమాచార ఆదానప్రదానానికి ఈ ఒప్పందాలు తోడ్పడతాయి. ఔషధ ప్రమాణ నియమావళితోపాటు సరసమైన ధరతో  జెనరిక్ ఔషధాల సరఫరాకు తగినట్లు భారతీయ ఫార్మకోపియాను భూటాన్ ఆమోదించడంలో ఇది తోడ్పడుతుంది.

శ్రీ పెంబా వాంగ్‌చుక్, కార్యదర్శి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

6

అంతరిక్ష సహకారంపై సంయుక్త కార్యాచరణ (జెపిఒఎ)

సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ఆదానప్రదాన కార్యక్రమాలు, శిక్షణ వగైరాల ద్వారా అంతరిక్ష సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఈ ఒప్పందం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తుంది.

శ్రీ జిగ్మే టెన్జింగ్, కార్యదర్శి, ప్రభుత్వ సాంకేతిక సంస్థ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

7

నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (ఎన్‌కెఎన్‌)-భూటాన్ డ్రక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ మధ్య ఆదానప్రదానంపై అవగాహన ఒప్పందం పునరుద్ధరణ

‘ఎన్‌కెఎన్‌’, ‘డ్ర‌క్‌రెన్‌’ మధ్య విద్యార్థుల ఆదానప్రదానంపై ఒప్పందం పునరుద్ధరణకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ మేరకు భారత ‘ఎన్‌కెఎన్‌’ (NKN), భూటాన్‌లోని ‘డ్ర‌క్‌రెన్‌’ (DrukREN) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీంతో భారత్-భూటాన్ డిజిటల్ అనుసంధానం మెరుగవుతుంది. విద్యార్థి పరిశోధకులు, భూటాన్ పరిశోధన సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది.

శ్రీ జిగ్మే టెన్జింగ్, కార్యదర్శి, ప్రభుత్వ సాంకేతిక సంస్థ, ఆర్‌జిఒబి

శ్రీ సుధాకర్ దలేలా, భూటాన్‌లో భారత రాయబారి

ఇవేకాకుండా భారత్-భూటాన్ మధ్య రైల్వే సంబంధాల ఏర్పాటుపై అవగాహన ఒప్పందాన్ని ఉభయ పక్షాలు అంగీకరించి సంతకాలు చేశాయి. ఈ మేరకు ప్రతిపాదిత కోక్రాఝర్-గెలెఫూ, బనార్హట్-సంత్సే రైలుమార్గాల సంధానం సహా రెండుదేశాల నడుమ సంబంధిత కార్యాచరణకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

***



(Release ID: 2016330) Visitor Counter : 53