హోం మంత్రిత్వ శాఖ
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (GD) పరీక్ష మొదటిసారిగా హిందీ, ఇంగ్లీషు కాకుండా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహణ
దేశంలో 128 నగరాల్లో 2024 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కానున్న 48 లక్షల మంది అభ్యర్థులు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో పరీక్ష నిర్వహించనున్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2024 జనవరి 1 నుంచి కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షను హిందీ ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని నిర్ణయించిన హోం శాఖ
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, స్థానిక భాషలను ప్రోత్సహించడానికి స్థానిక భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర హోంశాఖ మంత్రి
హిందీ. ఆంగ్ల భాషలతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా , ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష ప్రశ్నపత్రాలు
దేశవ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహిస్తున్న ప్రధాన పరీక్షల్లో లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షల్లో కానిస్టేబుల్ (GD) ఎంపిక పరీక్ష ఒకటి
Posted On:
11 FEB 2024 11:51AM by PIB Hyderabad
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (GD) ప్రవేశ పరీక్ష మొదటిసారిగా హిందీ, ఇంగ్లీష్ కాకుండా 13 ప్రాంతీయ భాషలలో జరగనున్నది దేశంలో 128 నగరాల్లో 2024 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే పరీక్షలకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షను 2024 జనవరి 1నుంచి ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు దళంలో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, స్థానిక భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా చొరవతో ఈ చారిత్రాత్మక నిర్ణయం అమలులోకి వచ్చింది.
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష ప్రశ్న పత్రాలు హిందీ, ఇంగ్లీషుతో పాటు క్రింది 13 ప్రాంతీయ భాషలలో ఉంటాయి.
1. అస్సామీ
2. బెంగాలీ
3. గుజరాతీ
4. మరాఠీ
5. మలయాళం
6. కన్నడ
7. తమిళం
8. తెలుగు
9. ఒడియా
10. ఉర్దూ
11. పంజాబీ
12. మణిపురి
13. కొంకణి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహిస్తున్న ముఖ్యమైన పరీక్షల్లో కానిస్టేబుల్ GD పరీక్ష ఒకటి, దీనికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత హాజరవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని . హిందీ,ఇంగ్లీషుతో పాటు పైన పేర్కొన్న 13 ప్రాంతీయ భాషలలో పరీక్షలు నిర్వహించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం, SSC కానిస్టేబుల్ (GD) పరీక్ష 2024 ను ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర హోం శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువత తమ మాతృభాష/ప్రాంతీయ భాషలో పరీక్షకు హాజరు కావడానికి, ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది.ఫలితంగా దేశవ్యాప్తంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి సమాన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ మాతృభాషలో సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటీ) ఎంపిక పరీక్ష రాయగలుగుతారు. మాతృభాషలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలో ప్రతిభ కనబరచి దేశ సేవ కోసం
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ లో చేరడానికి ఎక్కువ మందికి అవకాశం లభిస్తుంది.
***
(Release ID: 2004987)
Read this release in:
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam