ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్య సభ లో రిటైర్ అవుతున్న సభ్యుల కు వీడుకోలు పలికిన ప్రధాన మంత్రి
‘‘మన దేశ ప్రజాస్వామ్యాన్ని గురించి జరిగే ప్రతి ఒక్క చర్చ లో డాక్టర్ శ్రీ మన్‌మోహన్ సింహ్ యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది’’
‘‘ఈ సభ అనుభవాలు మలచినటువంటి ఆరు సంవత్సరాల తో కూడిన ఒక వైవిధ్యభరితమైన విశ్వవిద్యాలయం అని చెప్పాలి’’
Posted On:
08 FEB 2024 12:06PM by PIB Hyderabad
రాజ్య సభ లో పదవీ కాల పరిమితి ముగుస్తున్న సభ్యుల కు ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడుకోలు పలికారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి రాజ్య సభ లో ప్రసంగిస్తూ, లోక్ సభ ప్రతి అయిదు సంవత్సరాల అనంతరం మారుతూ ఉంటుంది; అయితే, రాజ్య సభ ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి క్రొత్త జీవశక్తి ని అందుకొంటూ ఉంటుంది అన్నారు. అదే విధం గా రెండేళ్ళ కు ఒకసారి చోటుచేసుకొనేటటువంటి వీడుకోలు మరపురాని జ్ఞాపకాల ను మిగల్చడం తో పాటుగా, క్రొత్త సభ్యుల కు వెలకట్టలేనటువంటి ఉత్తరదాయిత్వాన్ని అందజేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
డాక్టర్ శ్రీ మన్ మోహన్ సింహ్ యొక్క తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, ‘‘సభ కు మరియు దేశ ప్రజల కు ఆయన దీర్ఘకాలం పాటు అందజేసిన మార్గదర్శకత్వం వల్ల మన దేశం లో ప్రజాస్వామ్యం గురించి జరిగే ప్రతి ఒక్క చర్చ లో ఆయన ప్రస్తావన ఉంటుంది’’ అన్నారు. ఆ కోవ కు చెందిన విశిష్ట సభ్యులు దారిని చూపే దీపాలు గా ఉన్నందున, పార్లమెంటు లో సభ్యులు గా ఉన్న వారందరూ ఆ వ్యక్తుల నడవడిక నుండి నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి అని ప్రధాన మంత్రి సూచించారు. పూర్వ ప్రధాని సభ లో వోటు వేసేందుకు చక్రాల కుర్చీ లో వచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, ఒక సభ్యుని కి అతని కర్తవ్యాల ను తెలియ జేసేందుకు ప్రేరణదాయకమైన ఉదాహరణ గా ఇది నిలచిపోతుంది అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాని కి బలాన్ని జోడించడం కోసం ఆయన తరలి వచ్చారు’’ అని నేను నమ్ముతున్నాను అని ప్రధాన మంత్రి అన్నారు. డాక్టర్ శ్రీ మన్‌మోహన్ సింహ్ కు దీర్ఘాయుష్షు కలగాలని, మరి ఆయన ఆరోగ్య ప్రదమైన జీవనం సాగించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
మరింత పెద్దదైనటువంటి సార్వజనిక వేదిక లో పాలుపంచుకోవడం కోసం సభ ను వీడుతున్న సభ్యులు, రాజ్య సభ లో వారు సంపాదించుకొన్న అనుభవం ద్వారా భారీ గా ప్రయోజనాన్ని పొందుతారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది అనుభవాలు మలచినటువంటి ఆరేళ్ళ వైవిధ్యభరితమైన విశ్వవిద్యాలయం. ఎవరైనా ఇక్కడ నుండి బయటకు వెళితే అనేక అంశాల ను నేర్చుకొని, మరి దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషి ని బలోపేతం చేయగలరు’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుత ఘట్టం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి చాటిచెప్తూ, ఈ రోజు న సభ ను వీడిపోతున్న సభ్యులు పాత భవనం మరియు క్రొత్త భవనం లలో వారి యొక్క కాలాన్ని వెచ్చించిన అవకాశాన్ని సొంతం చేసుకొన్నారని, మరి వారు రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల తో పాటు, అమృత కాలాని కి సాక్షులు గా నిలచారని పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి కాలం లో అనిశ్చిత పరిస్థితులు దేశాన్ని చుట్టుముట్టిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకువస్తూ, సభ యొక్క కార్యకలాపాల నిర్వహణ మార్గం లో ఏ అడ్డంకినీ రానీయని సభ్యుల నిబద్ధత ను ప్రశంసించారు. పార్లమెంటు సభ్యులు వారి యొక్క బాధ్యతల ను నిర్వర్తించడం కోసం భారీ రిస్కుల ను తీసుకొన్నారని ఆయన అన్నారు. కరోనా వైరస్ కు ప్రాణాల ను పణం పెట్టిన సభ్యుల కు ప్రధాన మంత్రి ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. జరిగిన దానిని సభ హుందా గా స్వీకరించి, మరి పయనాన్ని కొనసాగించింది అని ఆయన అన్నారు.
ప్రతిపక్ష సభ్యులు నల్లని దుస్తుల ను ధరిస్తున్న ఘటన ను గురించి ప్రధాన మంత్రి స్ఫురణ కు తెస్తూ, దేశం సమృద్ధి తాలూకు సరిక్రొత్త శిఖరాల ను అధిరోహిస్తున్నదని, మరి ఈ యొక్క ఘటన ను దేశ పురోగతి యాత్ర కు దిష్టి తగలకుండా పెట్టిన ‘నల్లటి చుక్క’ గా భావించవచ్చన్నారు.
ప్రధాన మంత్రి ప్రాచీన ధర్మ గ్రంథాల లోని సుభాషితాల ను గురించి ప్రస్తావించి, చక్కని వ్యక్తుల ను చుట్టూ అట్టిపెట్టుకొనే వ్యక్తులు అవే రకం గుణగణాల ను అలవరచుకొంటారని, మరి చెడు సావాసాల ను అలవరచుకొనేవారు కళంకులు గా మారిపోతారని వివరించారు. నది లో ఉన్న నీరు ఆ నది ప్రవహిస్తూ ఉంటేనే త్రాగడాని కి పని కి వస్తుంది; మరి, ఆ నది సముద్రం లో కలసిపోయిన వెంటనే నది నీరు ఉప్పగా మారిపోతుందని కూడా ఆయన చెప్పారు. రిటైర్ అవుతున్న సభ్యుల అనుభవం ప్రతి ఒక్కరి కి స్ఫూర్తిదాయకం గా ఉంటుంది అంటూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. సభ ను వీడి వెళ్ళేవారి కి ఆయన శుభాకాంక్షల ను తెలుపుతూ, వారిని అభినందించారు.
*****
DS/TS
(Release ID: 2003882)
Visitor Counter : 110
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam