ఆర్థిక మంత్రిత్వ శాఖ
పేదరికాన్ని పారదోలేందుకు సబ్ కే సాత్ ద్వారా పేదలకు ప్రభుత్వం సాధికారత కల్పిస్తోందిః కేంద్ర ఆర్థిక మంత్రి
- ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, పీఎం స్వానిధి, పీఎం జన్మన్ యోజన ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు ప్రజలకు సాధికారత చేకూర్చేందుకు నిదర్శనం: ఆర్థిక మంత్రి
Posted On:
01 FEB 2024 12:38PM by PIB Hyderabad
పేదల కళ్యాణమే.. దేశ కళ్యాణ్గా దృష్టి సారించారు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్. పేదల సాధికారతపై ప్రభుత్వం నమ్మకం ఉంచుతోందని ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ రోజు మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024ను మంత్రి చట్ట సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ “అర్హతల ద్వారా పేదరికాన్ని పరిష్కరించే మునుపటి విధానం చాలా నిరాడంబరమైన ఫలితాలకు దారితీసింది. పేదలు అభివృద్ధి ప్రక్రియలో సాధికార భాగస్వాములు అయినప్పుడు, వారికి సహాయపడే ప్రభుత్వ శక్తి కూడా అనేక రెట్లు పెరుగుతుంది. ” అని అన్నారు. గత 10 ఏళ్లలో సబ్‌కా సాథ్ సాధనలో 25 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందేందుకు ప్రభుత్వం సహాయం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అటువంటి సాధికారత కలిగిన వ్యక్తుల శక్తి మరియు అభిరుచితో ప్రభుత్వ ప్రయత్నాలు ఇప్పుడు ఏకీకృతం అవుతున్నాయని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు; ఇది వారిని నిజంగా పేదరికం నుండి పైకి తీసుకువస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ పీఎం-జన్ ధన్ ఖాతాలను ఉపయోగించి ప్రభుత్వం రూ.34 లక్షల కోట్ల డిపాజిట్లు లభించగా.. ప్రభుత్వం రూ.2.7 లక్షల కోట్ల పొదుపును సాధించిందని తెలిపారు. ఇది గతంలో ప్రబలంగా ఉన్న లీకేజీలను నివారించడం ద్వారా సాధ్యమైందన్నారు. ఈ పొదుపు ‘గరీబ్ కళ్యాణ్’కి మరిన్ని నిధులు సమకూర్చడంలో దోహదపడింది. పేదలకు సాధికారత కల్పించిన పథకాలను ఉదాహరణగా చూపుతూ… శ్రీమతి. సీతారామన్ మాట్లాడారు. “పిఎం-స్వానిధి 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించింది. ఆ మొత్తం నుండి 2.3 లక్షల మంది మూడవసారి క్రెడిట్ పొందారు. ” అని అన్నారు. సాధికారతకు ప్రధాన ఉదాహరణగా పీఎం-జన్మన్ యోజనను పేర్కొంటూ, కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పథకం ముఖ్యంగా బలహీనమైన గిరిజన సమూహాలకు చేరువవుతోందని, వారు ఇప్పటివరకు అభివృద్ధి రంగానికి వెలుపల ఉన్నారని అన్నారు. వీరికి పథకం సాయం అందిస్తుందని తెలిపారు.
****
(Release ID: 2001728)
Visitor Counter : 194
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam