ఆర్థిక మంత్రిత్వ శాఖ
అద్దె గృహాలు, లేదా మురికివాడలు, లేదా చావళ్లు మరియు అనధికార కాలనీలలో నివసిస్తున్నఅర్హులైన మధ్యతరగతి వర్గాల వారికి స్వగృహ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఇళ్లు కొనుగోలుకు లేదా నిర్మించడానికి ప్రభుత్వం స్కీమ్‌ను ప్రారంభించింది
3 కోట్ల గృహాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజన (గ్రామీన్) పథకం చేరువ లో ఉంది
కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల వచ్చే అవసరాలను తీర్చడానికి రాబోయే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు
Posted On:
01 FEB 2024 12:48PM by PIB Hyderabad
ఈరోజు పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్ "అద్దె ఇళ్ళు, లేదా మురికివాడలు, లేదా చావలు మరియు అనధికారిక కాలనీలలో నివసిస్తున్న" మధ్యతరగతిలోని అర్హులైన వర్గాలకు వారి స్వంత ఇళ్ళు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తుందని ప్రకటించారు.
పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) సాధించిన విజయాన్ని హైలైట్ చేస్తూ, కోవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, పథకం అమలు కొనసాగిందని, ప్రభుత్వం మూడు కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఏర్పడే అవసరాలను తీర్చేందుకు వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
2047 నాటికి భారత్‌ను ‘వికసిత్ 47’ అభివృద్ధి చెందిన దేశంగా సర్వతోముఖంగా, సర్వవ్యాప్తం గా, అందరినీ కలుపుకుని పోయే (సర్వాంగిణ, సర్వస్పర్శి మరియు సర్వసమావేశి) అభివృద్ధి విధానంతో ప్రభుత్వం పని చేస్తోందని శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.
(Release ID: 2001724)
Visitor Counter : 253
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam