ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇళ్ల పై కప్పులపై సౌర ఫలకాల ఏర్పాటు పథకం
పథకం వల్ల కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది
చెల్లింపుల భద్రత వ్యవస్థ ద్వారా ప్రజా రవాణాలో ఈ-బస్సుల వినియోగానికి ప్రోత్సాహం.. ఆర్థిక మంత్రి
పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అందించడం కోసం బయో మాన్యుఫాక్చరింగ్ , బయో ఫౌండ్రీ రంగంలో నూతన పథకం
Posted On:
01 FEB 2024 12:47PM by PIB Hyderabad
ఈ రోజు పార్లమెంటులో 2024-2025 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హరిత వృద్ధి మరియు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించారు.ప్రభుత్వం అనుసరిస్తున్న సర్వతోముఖ, సర్వవ్యాపి, అందరినీ కలుపుకుపోయే (సర్వతోముఖ) విధానంలో భాగంగా కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ఇళ్ల పై కప్పులపై సౌర ఫలకాల ఏర్పాటు- ఉచిత విద్యుత్
ఇళ్ల పై కప్పులపై సౌర ఫలకాల ఏర్పాటు చేయడానికి రూపొందించిన పథకం వల్ల కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందే వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన రోజున ప్రధాన మంత్రి ప్రకటించిన విధంగా ఈ పథకం రూపొందింది. పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఎ. ఉచిత సౌరవిద్యుత్, మిగులు విద్యుత్ ను పంపిణీ సంస్థలకు అమ్మడం ద్వారా కుటుంబాలకు ఏటా పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు పొదుపు
బి. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్;
సి. సరఫరా , అమరిక రంగంలో పెద్ద సంఖ్యలో విక్రేతలకు వ్యవస్థాపక అవకాశాలు;
డి. తయారీ, అమరిక, నిర్వహణ రంగంలో సాంకేతిక నైపుణ్యమున్న యువతకు ఉద్యోగ అవకాశాలు;
గ్రీన్ ఎనర్జీ
2070 నాటికి శూన్య ఉద్గార స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రీమతి సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఈ క్రింది చర్యలను ప్రతిపాదించారు:
ఎ. ఒక గిగా-వాట్ ప్రారంభ సామర్థ్యానికి పవన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలి
బి. 2030 నాటికి 100 మెట్రిక్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్, ద్రవీకరణ సామర్థ్యాన్ని ఏర్పాటు . . సహజవాయువు, మిథనాల్, అమ్మోనియా దిగుమతులను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.
సి. రవాణా, గృహావసరాల కోసం వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)లో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ)ను తప్పనిసరిగా మిలితం చేయాలి
డి. బయోమాస్ యంత్రాల సేకరణకు ఆర్థిక సహాయం అందించాలి
ఎలక్ట్రిక్ వాహనాల కోసం అనువైన వ్యవస్థ
"తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు సహకారం అందించడం ద్వారా మా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థ ను విస్తరించి, బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది" అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపుల భద్రత వ్యవస్థ ద్వారా ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ఎక్కువగా చేయడానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రి ప్రకటించారు.
బయో మాన్యుఫ్యాక్చరింగ్ , బయో ఫౌండ్రీ రంగం
హరిత వృద్ధిని సాధించడానికి శ్రీమతి సీతారామన్ నూతన పథకాన్ని ప్రతిపాదించారు. దీని కింద పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించే బయోడిగ్రేడబుల్ పాలిమర్, బయో ప్లాస్టిక్, బయో ఫార్మాస్యూటికల్స్ , బయో-వ్యవసాయ ముడి పరికరాలు వంటి బయో-మాన్యుఫ్యాక్చరింగ్ , బయో-ఫౌండ్రీ రంగానికి ప్రోత్సాహం అందిస్తారు. . "ఈ పథకం నేటి వినియోగ తయారీ నమూనాను పునరుత్పత్తి సూత్రాలపై ఆధారపడి పని చేయడానికి కూడా సహాయపడుతుంది" అని ఆమె అన్నారు.
****
(Release ID: 2001361)
Visitor Counter : 388
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam