ప్రధాన మంత్రి కార్యాలయం
మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
21 JAN 2024 9:25AM by PIB Hyderabad
మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
‘‘మేఘాలయ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు! ఈ రాష్ట్ర అపురూప సంస్కృతితోపాటు అక్కడి ప్రజల అసాధారణ విజయాలపై వేడుకల నిర్వహణకు ఇది సముచిత సందర్భం. భవిష్యత్తులో మేఘాలయ సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహించగలదు’’ అని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
***
DS/RT
(Release ID: 1998310)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam