ప్రధాన మంత్రి కార్యాలయం
లక్షద్వీప్‌లో లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
లక్షద్వీప్ ప్రగతిపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని
Posted On:
04 JAN 2024 9:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న లక్షద్వీప్‌లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు.
దీనిపై ‘ఎక్స్’ ద్వారా పోస్ట్ చేసిన సందేశంలో:
‘‘సమాజంలోని అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు చేరడంకన్నా సంతృప్తి కలిగించే విషయం మరేముంటుంది. నిన్నటి నా లక్షద్వీప్ పర్యటనలో సాగిన ఈ ఇష్టాగోష్ఠి ఇందుకు నిదర్శనం...’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే లక్షద్వీప్ ప్రగతికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ మేరకు ‘‘గడచిన 9 సంవత్సరాలుగా లక్షద్వీప్ పురోగమన వేగం పెంచడానికి మేమెంతో కృషి చేశాం...
దీంతో ఇవాళ మా సంకల్పం మరింత బలోపేతమైంది!’’ అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1993282)
Visitor Counter : 147
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam