ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా టుడే ఇంట‌ర్వ్యూలో విస్తృతాంశాల‌పై మాట్లాడిన ప్ర‌ధానమంత్రి

Posted On: 03 JAN 2024 3:59PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఇండియా టుడే’ ప‌త్రిక‌కు తానిచ్చిన ఇంటర్వ్యూ విశేషాల లింకును ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.
   భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అనుస‌రించాల్సిన మార్గాల గురించి ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివ‌రించారు. అలాగే ‘మోదీ వాగ్దానం’ అంటే ఏమిటి.. ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌వాళ్లేమిటి? త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న జ‌వాబిచ్చారు.

ఈ మేర‌కు ఎక్స్ పోస్ట్‌ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘ఇండియా టుడే’ ప‌త్రిక‌కు నేనిచ్చిన ఇంట‌ర్వ్యూ ముఖ్యాంశాల‌ను ఈ లింకుద్వారా మీరు చూడ‌వ‌చ్చు. ఈ సంద‌ర్భంగా మా ప్ర‌భుత్వ పాల‌న వ్య‌వ‌హారాలు స‌హా వివిధ అంశాల‌పై నా అభిప్రాయాల‌ను వెల్ల‌డించాను. ముఖ్యంగా భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే మార్గాల గురించి, మోదీ వాగ్దానం అంటే ఏమిటి... ప్రపంచం ముందున్న సమస్యలేమిటి? త‌దిత‌ర అంశాల‌పైనా  వివరించాను’’ అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT



(Release ID: 1992929) Visitor Counter : 101